అల్లు ఆర్హా.. రిపబ్లిక్ డే విషెస్!!

Update: 2017-01-26 06:13 GMT

దేశభక్తికి సంబంధించిన అంశాల్లో అల్లు అర్జున్ స్పందించే తీరు.. మిగిలిన హీరోలకు విభిన్నంగా ఉంటుంది. కేవలం ట్విట్టర్ లో ఓ పోస్ట్ చేసి ఊరుకోవడంతో సరిపెట్టడు. గతంలో ఓసారి ఇండిపెండెన్స్ డే సందర్భంగా.. 'అయాం దట్ ఛేంజ్' అంటూ సుకుమార్ దర్శకత్వంలో ఓ షార్ట్ ఫిలిం చేశాడు.

అలాగే అభిమానులకు తన చిన్నారిని చూపించేందుకు.. రిపబ్లిక్ డే విషెస్ చెప్పేందుకు.. తన నెలల చిన్నారి అయిన అల్లు అర్హా తో ఓ సూపర్బ్ ఫోటోను షేర్ చేశాడు అల్లు అర్జున్. తెల్లని దుస్తులు ధరించిన తన చిన్నారిని.. భారత దేశ జెండా పక్కన  బజ్జోపెట్టి.. ఆ ఫోటోను పోస్ట్ చేశాడు బన్నీ. జెండా కర్రగా రోల్ చేసిన ఓ తెల్లని వస్త్రం.. మూడు రంగులతో అతి పల్చని వస్త్రాలు.. మధ్యలో నీలం రంగులో కనిపిస్తున్న చిన్నారి క్యాప్.. అ పక్కనే ముసి ముసి నవ్వులు నవ్వుతూ అల్లు ఆరా కనిపిస్తుంది.

ఇంతకంటే గొప్పగా గణతంత్ర దినోత్సవానికి విషెస్ చెప్పించడం ఎవరి వల్లా కాదేమో అనిపిస్తుంది. రెండు నెలల చిన్నారితో ఇలా దేశభక్తి విషెస్ చెప్పించాలన్న బన్నీ ఐడియా మాత్రం అదిరిందంతే.
Tags:    

Similar News