టాప్ స్టోరి: అల్లు అర్హ వ‌ర్సెస్ ఘ‌ట్ట‌మ‌నేని సితార‌!

Update: 2021-07-31 06:17 GMT
కంటే కూతురినే క‌నాలి.. ద‌ర్శ‌క‌ర‌త్న దాస‌రి నారాయ‌ణ‌రావు ఏకంగా సినిమానే తీసారు. కొడుకుతో పోలికే లేకుండా ఈరోజుల్లో కూతురు త‌ల్లిదండ్రుల‌ను ఎంతో ఎటాచ్ మెంట్ తో ప్రేమ‌గా చూసుకుంటుంద‌నేది బ‌ల‌ప‌డుతోంది. ఇది మారిన ట్రెండ్ మ‌హిమ‌. ఇక కూతురు ఎంత బుద్ధిమంతురాలో తెలియాలంటే అటు అల్లు అర్హ‌ను కానీ.. ఇటు ఘ‌ట్ట‌మ‌నేని సితార‌ను కానీ చూడాలి.

ఆ ఇద్ద‌రూ ఎంతో బుద్ధిమంతులు. నిన్న‌టికి నిన్న క్యూట్ సితార పెయింటింగ్ (చిత్ర‌లేఖ‌నం) ఎలా చేయాలో నేర్పిస్తున్న ల‌వ్ లీ వీడియో అంత‌ర్జాలంలో వైర‌ల్ అయ్యింది. అందులో సితార ఎక్క‌డా త‌డ‌బ‌డ కుండా క్లాస్ చెబుతోంది. ఆ వీడియో జెట్ స్పీడ్ తో వైర‌ల్ అయ్యింది.

ఇంత‌లోనే అల్లు అర్హ బుద్ధిగా క్యూట్ గా ఆన్ లైన్ క్లాసులు వింటూ క‌నిపించింది. ఎప్పుడూ ఏదో ఒక అల్ల‌రి చేస్తూ త‌న డాడీ తాత‌య్య బాబాయ్ ల‌ను ఆట ప‌ట్టించే అర్హ ఇప్పుడు మ‌రీ ఇంత బుద్ధిగా మారిపోయిందేమిట చెప్మా! అంటూ అభిమానులు ఎంతో సంబ‌రంగా అర్హ‌నే చూస్తున్నారు. అల్లు స్నేహారెడ్డి ఓ వీడియోను తన ఇన్ స్టా స్టోరీలో షేర్ చేశారు. విఘ్నేశ్వరుని శ్లోకంతో ప్రారంభించారు క్లాస్. ఆ శ్లోకాన్ని అల్లు అర్హ కూడా చెప్పేస్తోంది. నిజానికి సితార .. అర్హ ఇద్ద‌రూ అల్ల‌రిలో మేటి. ఆ ఇద్ద‌రికీ డాడీతో చ‌నువు కూడా ఎక్కువే. అర్హ తో బ‌న్ని.. సితార‌తో మ‌హేష్ ఎంతో క‌నెక్టింగ్ గా ఉంటారు.

అల్లు ఘ‌ట్ట‌మ‌నేని కిడ్స్ తెరంగేట్రం

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వార‌సురాలు అల్లు అర్హ `శాకుంత‌లం` చిత్రంతో బాల‌న‌టిగా తెరంగేట్రం చేస్తోంది. రామాయ‌ణం చిత్రంతో జూనియ‌ర్ ఎన్టీఆర్ స‌హా ఎంద‌రినో బాల‌న‌టులుగా తెర‌కు పరిచ‌యం చేసిన గుణ‌శేఖ‌ర్ ఇప్పుడు బ‌న్ని కుమార్తె అర్హ‌ను తెర‌కు ప‌రిచ‌యం చేస్తుండ‌డం ఆస‌క్తిని క‌లిగిస్తోంది. ఇంత‌కుముందు త‌న కుమార్తె అర్హ డెబ్యూ మూవీ గురించి ఆనందం వ్య‌క్తం చేస్తూ బ‌న్ని - స్నేహారెడ్డి దంప‌తులు గుణ‌శేఖ‌ర్ కి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

ఇక ఘ‌ట్ట‌మ‌నేని మ‌హేష్ వార‌సురాలు సితార డెబ్యూ ఎప్పుడు ఉంటుంది? అన్న‌దానికి కాల‌మే స‌మాధానం చెప్పాలి. ఇప్ప‌టికే సితార యూట్యూబ్ చానెల్ .. సోష‌ల్ మీడియాల్లో భారీ ఫాలోయింగ్ ఉంది. అక్క‌డ ఆల్మోస్ట్ సీతా పాప ఒక ప్ర‌తిభావంత‌మైన‌ న‌టిలానే పాపుల‌రైపోతోంది. ఒక‌వేళ బాల‌న‌టిగా తెరంగేట్రం చేస్తే ఇక సంచ‌ల‌నాలే! అల్లు అర్హ‌- ఘ‌ట్ట‌మ‌నేని సితార కాంబినేష‌న్ లో ఏదైనా సినిమాకి గుణ‌శేఖ‌ర్ ప్లాన్ చేస్తారేమో చూడాలి.

ముందుంది ముస‌ళ్ల పండ‌గ‌

టాలీవుడ్ లో ఇంకా ప‌లువురు సెన్సేష‌న‌ల్ డెబ్యూ డాట‌ర్స్ గురించి చ‌ర్చ సాగుతోంది. ప‌వర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ కుమార్తె ఆద్య కొణిదెల‌ తెరంగేట్రం గురించి రేణు దేశాయ్ కి నిరంత‌రం ప్ర‌శ్న‌లు ఎదుర‌వుతూనే ఉన్నాయి. అలాగే ప‌వ‌న్ క‌ల్యాణ్ మ‌రో కుమార్తె పోలెనా అంజ‌నా ప‌వ‌నోవా కూడా బాల‌న‌టిగా ఆరంగేట్రం చేసేందుకు ఛాన్సుంది. ఇక మంచు విష్ణు క‌వ‌ల‌ కుమార్తెలు .. మంచు ల‌క్ష్మీ ప్ర‌స‌న్న స‌రోగ‌సి కుమార్తె బాల‌న‌టీమ‌ణులుగా ఆరంగేట్రానికి సిద్ధ‌మ‌వుతున్నార‌న్న గుస‌గుస‌లు ఉన్నాయి. ఇప్ప‌టికే వీరంతా సోష‌ల్ మీడియాల్లోనూ ఫాలోవ‌ర్స్ ని పెంచుకుంటూ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నారు. ఇటీవ‌ల మంచు ల‌క్ష్మీ ప్ర‌స‌న్న త‌న కుమార్తెల‌తో క‌లిసి ఓ వీడియోలో సంద‌డి చేసిన తీరు ప్ర‌ముఖంగా చ‌ర్చ‌కు వ‌చ్చింది.




Full View

Tags:    

Similar News