ఒకప్పుడు సౌత్ సినిమాలంటే ఉత్తరాది ప్రేక్షకులకు ముఖ్యంగా హిందీ ప్రేక్షకులకు చిన్నచూపు ఉండేది. హిందీ సినిమాలు సౌత్ లో ఆడిన దాఖలాలు ఉన్నాయి కాని కొన్ని సంవత్సరాల క్రితం సౌత్ సినిమా లు హిందీలో డబ్బింగ్ అవ్వడం చాలా తక్కువ. గత పదేళ్లుగా సౌత్ సినిమా లు డబ్బింగ్ అయ్యి టీవీ ల్లో టెలికాస్ట్ అవ్వడంతో హిందీ ప్రేక్షకులు సౌత్ సినిమాలంటే ఆసక్తి పెంచుకుంటున్నారు.
ఈ మధ్య కాలంలో సౌత్ సినిమాలు థియేట్రికల్ రిలీజ్ అయ్యి కూడా భారీగా వసూళ్లు రాబడుతున్నాయి. పుష్ప సినిమా హిందీ లో రిలీజ్ అయ్యి ఏకంగా వంద కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ప్రమోషన్ పెద్దగా లేకుండానే పుష్ప వంద కోట్లు సాధించడం తో అంతా కూడా నోరు వెళ్లబెట్టారు. బన్నీకి అంతకు ముందే శాటిలైట్ ద్వారా ఉత్తరాది ప్రేక్షకుల్లో పాపులారిటీ ఉంది.
ఆ పాపులారిటీ ఉపయోగపడటంతో పాటు పుష్ప లో ఉన్న ఎలిమెంట్స్ కు వారు బాగా కనెక్ట్ అయ్యారు. అందుకే వారాలు గడిచే కొద్ది వసూళ్లు పెరుగుతూ వచ్చాయి. కేవలం పుష్ప అని మాత్రమే కాకుండా ఇంకా చాలా సినిమాలు కూడా ఉత్తర భారతంలో కుమ్మేస్తున్నాయి. కేజీఎఫ్ ఏకంగా ఆల్ టైమ్ రికార్డును అక్కడ దక్కించుకున్న విషయం తెల్సిందే.
సౌత్ సినిమా లు హిందీ ప్రేక్షకులను ఆకట్టుకోవడం కు కారణం ఏంటి అనేది ఎవరికి తోచిన విధంగా వారు విశ్లేషిస్తున్నారు. తాజాగా అల్లు అర్జున్ ఒక జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ సౌత్ సినిమా లు నార్త్ లో ఈమద్య ఎక్కువ ఆడటం కు కారణం ఏంటీ అనే విషయమై తన విశ్లేషణ అందించాడు.
బన్నీ మాట్లాడుతూ.. పాటలు.. ఫైట్స్.. హీరోయిజం ఎలివేట్ చేసే సన్నివేశాల సౌత్ సినిమా ల్లో బాగుంటున్నాయి. వాటిని ఇప్పుడు హిందీ ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. సౌత్ ప్రేక్షకులు అలాంటి సినిమా లను చూసేందుకు అలవాటు పడటంతో ఫిల్మ్ మేకర్స్ రెగ్యులర్ గా అవే తరహా కథలు ఎంపిక చేసుకుంటున్నారు. కనుక సౌత్ సినిమా లను హిందీ ప్రేక్షకులు ఆధరిస్తున్నారనే అభిప్రాయంను బన్నీ వ్యక్తం చేశాడు.
ఇక బన్నీ సినిమాల విషయానికి వస్తే పుష్ప 2 సినిమా షూటింగ్ మొదలు అవ్వాల్సి ఉంది. పుష్ప 1 భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో పుష్ప 2 భారీ ఎత్తున వసూళ్లు సాధిస్తుందనే నమ్మకం తో అంతా ఉన్నారు. అంచనాలు అందుకునేలా దర్శకుడు సుకుమార్ స్క్రిప్ట్ ను రెడీ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.