సమ్మర్ లో సౌత్ సినీ జనాలకు ఫుల్ పండగ అని చెప్పడం చిన్న మాటే అవుతుంది - ఎందుకంటే ఎప్పుడు లేని విధంగా భారీ యాక్షన్ సినిమాలు కోలీవుడ్ టాలీవుడ్ లో రిలీజ్ కాబోతున్నాయి. ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా కూడా బాక్స్ ఆఫీస్ లెక్కలు ఒక్కసారిగా మారిపోతాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. తెలుగులో అల్లు అర్జున్ నా పేరు సూర్య.. మహేష్ భరత్ అను నేను రిలీజ్ అవుతుండగా.. తమిళం నుండి రజినీకాంత్ 2.0 వస్తోంది.
అయితే ఈ సినిమాల రిలీజ్ డేట్స్ పై కాలంగా కొంచెం కన్ఫ్యూజన్ కి గురిచేసింది. ఫైనల్ గా రజినీకాంత్ ఏప్రిల్ 14న రిలీజ్ కాబోతోంది అని క్లారిటీ ఇచ్చాడు. మొన్నటి వరకు 2.0 రిలీజ్ డేట్ ని బట్టి తమ సినిమాను ఏప్రియల్ 27న సినిమా రిలీజ్ చేద్దామనుకున్న నా పేరు సూర్య టీమ్ ఇప్పుడు రజినీతో పాటు రావడానికి సిద్ధమైనట్లు రూమర్లు వచ్చేశాయి. కట్ చేస్తే ఈరోజు ప్రెస్ మీట్ ఒకటి పెట్టేసిన బన్నీ అండ్ టీమ్ మాత్రం.. అస్సలు ఆ తేదీపై ఏమాత్రం క్లారిటీ ఇవ్వనేలేదు. కేవలం జనవరి 26న సైనిక అనే పాట.. ఫిబ్రవరి 14న మరోపాట రిలీజవుతుందని.. మార్చి నెల వచ్చేసరికి ఆడియో మొత్తం రిలీజ్ అవుతుంది అనే అప్డేట్ చెప్పారు. కాని సినిమా రిలీజ్ డేటును మాత్రం దాచే ఉంచారు.
బన్నీ ఎప్పుడొస్తాడు చెప్పడు. రజనీ ఎప్పుడొస్తాడు దాస్తాడు. మహేష్ ఎప్పుడొస్తాడో తెలియదు. అసలైతే ముందుగా భరత్ - సూర్య వార్ ఒకే రోజున ఏప్రయిల్ 27న స్టార్ట్ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు రజినీ - బన్నీ ల మధ్య మహేష్ సినిమా రిలీజ్ డేట్ కన్ఫ్యూజన్ లో పడింది. సినిమా కలెక్షన్స్ ని ఏ మాత్రం దెబ్బ పడకుండా వెనుకా ముందు ఓ పది రోజులు గ్యాప్ ఉండేలా దాదాపు అందరూ ప్లాన్ చేసుకుంటే మంచిది అంటున్నారు ట్రేడ్ వర్గాలు.