తెలుగు ఇండస్ట్రీలోని టాప్ హీరోలలో అల్లు అర్జున్ కూడా ఒకడు. తండ్రి పేరును ఉపయోగించుకుని సినిమాల్లోకి వచ్చినా... తరువాత తన కష్టంతో ఎదిగాడు. ఫైట్లు... డ్యాన్సులు... డైలాగులు అదరగొడుతున్నాడు. అతడు స్నేహారెడ్డిని ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. నేడు వారి ఏడో పెళ్లి రోజు.
అల్లు అర్జున్... స్నేహారెడ్డిది ప్రేమవివాహం. ఇండస్ట్రీతో ఎలాంటి సంబంధంలేని అమ్మాయి స్నేహా రెడ్డి. విదేశాలలో ఉన్నతవిద్యనభ్యసించింది. వ్యాపారవేత్త కేపీఎస్ రెడ్డి కూతురు ఆమె. కులాలు... ప్రాంతాలు వేరైనా... ఇద్దరూ పట్టుబట్టి తల్లిదండ్రులను పెళ్లికి ఒప్పించారు. ఎక్కువ కష్టపడింది అల్లుఅర్జునేనని అప్పట్లో గుసగుసలు వినిపించాయి. అల్లు అరవింద్ ఆ పెళ్లికి అయిష్టత చూపారని... అదే సమయంలో శ్రీజ చేసిన పని వల్ల... వీళ్ల పెళ్లికి వెంటనే ఒప్పుకోవాల్సి వచ్చిందని అంటారు. 2011 మార్చి 6న వీరి వివాహం అత్యంత వైభవంగా జరిగింది. వారి ప్రేమకు ప్రతిరూపంలో 2014 ఏప్రిల్ 4న వారికి అయాన్ పుట్టాడు. 2016లో కూతురు అర్హ జన్మించింది. వీళ్లది క్యూట్ ఫ్యామిలీగా చెప్పుకుంటారంతా.
బన్నీ సోషల్ మాధ్యమాలలో చాలా చురుకుగా ఉంటాడు... సినిమా అప్‌డేట్స్ తో పాటూ... తన వ్యక్తిగత.. ఫ్యామిలీ ఫోటోలు కూడా అప్‌డేట్ చూస్తుంటాడు. ఇద్దరు పిల్లలతో స్నేహా-బన్నీ జంట చూడముచ్చటైనదిగా చెప్పుకుంటారు నెటిజన్లు. ఆ క్యూట్ జంటకు పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్పకుండా ఎలా ఉంటాం?