ఎన్నో ఆశలు అంచనాలతో చేసిన నా పేరు సూర్య ఫలితం అభిమానులనే కాదు స్టైలిష్ స్టార్ ని కూడా బాగా నిరాశపరిచింది. ఏదో రెగ్యులర్ కమర్షియల్ సినిమా ఫెయిల్ అయితే మామూలే అనుకోవచ్చు కానీ దీని కోసం బన్నీ ఫిజికల్ గా మెంటల్ గా చాలా కష్టపడ్డాడు. దానికి తగ్గ గుర్తింపు వచ్చినా ఫలితం మాత్రం దక్కలేదు. అందుకే కొత్త కథల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. నా పేరు సూర్య విడుదలై రెండు నెలలు దాటిన నేపథ్యంలో కొత్త సినిమా ఎప్పుడు మొదలవుతుందా అని ఫాన్స్ ఎదురు చూస్తున్నారు. దానికి అడుగులు మెల్లగా పడుతున్నాయి. గత ఏడాది అఖిల్ తో హలో రూపంలో ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయిన విక్రమ్ కుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించే కొత్త సినిమా షూటింగ్ త్వరలో మొదలుపెట్టనున్నారు. స్క్రిప్ట్ ఇప్పటికే లాక్ అయిపోయిందని ఫైనల్ టచ్ అప్ ఇవ్వడంలో విక్రమ్ కుమార్ బిజీ గా ఉన్నాడని తెలిసింది.
ఇందులో మరో విశేషం కూడా ఉందట. అదే బన్నీ డ్యూయల్ రోల్. ఇప్పటి దాకా అల్లు అర్జున్ డబుల్ ఫోటో సినిమా చేయలేదు. ఇదే మొదటిది. ఇది కనక నిజమైతే ఫాన్స్ కి భలే ఎగ్జైటింగ్ న్యూస్ అవుతుంది. రామ్ చరణ్-జూనియర్ ఎన్టీఆర్-నాని ఇలా అందరి ఖాతాల్లో డ్యూయల్ రోల్ సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. లేనిది అల్లు అర్జున్ కు మాత్రమే. అఫ్ కోర్స్ మహేష్ బాబు కూడా ఉన్నాడు లెండి.. ఆ కొరత తీర్చేలా యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో విక్రమ్ కుమార్ మంచి కథ రాసుకున్నట్టు తెలిసింది. పైకి చెప్పకపోయినా లోలోపల హీరోయిన్ తో పాటు టెక్నీకల్ టీమ్ కి సంబంధించిన సెలక్షన్ జరిగిపోతోందట. నల్లమలుపు బుజ్జి శానం నాగ అశోక్ కుమార్ సంయుక్తంగా నిర్మించే ఈ సినిమా షూటింగ్ ఈ నెలలోనే మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి.