తమిళ దర్శకుల్లో మురుగదాస్ శైలి ప్రత్యేకం. ఆయన కెప్టెన్ విజయ్ కాంత్ తో తెరకెక్కించిన రమణ, సూర్యతో రూపొందించిన `గజిని`, విజయ్ తో చేసిన `తుపాకి`, కత్తి చిత్రాలు బ్లాక్ బస్టర్ లుగా నిలిచాయి. ఇదే చిత్రాలు తెలుగులోనూ రీమేక్ అయి సంచలనాలు సృష్టించాయి. అయితే బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ చిత్రాలని అందించిన ఈ దర్శకుడికి గత కొంత కాలంగా టైమ్ కలిసి రావడం లేదు. తమిళ, తెలుగు భాషల్లో మురుగదాస్ క్రేజీ స్టార్ లతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేశారు.
తెలుగులో మెగాస్టార్ చిరంజీవితో చేసిన `స్టాలిన్`, మహేష్ బాబు తో చేసిన `స్పైడర్` ఆశించిన విజయాల్ని అందించలేకపోయాయి. ఇక మహేష్ తో చేసిన `స్పైడర్` అయితే డిజాస్టర్ గా పేరు తెచ్చుకుంది. ఇక తమిళంలో విజయ్ తో చేసిన `సర్కార్, సూపర్ స్టార్ రజనీతో చేసిన `దర్బార్` సినిమాలు కూడా అదే ఫలితాన్ని అందించాయి. దీంతో మురుగదాస్ తన ఫామ్ ని కోల్పోయాడంటూ కామెంట్ లు మొదలయ్యాయి.
ఇదిలా వుంటే తెలుగులో స్టార్ హీరోతో సినిమా చేయాలని చాలా కాలంగా మురుగదాస్ ఎదురుచూస్తున్నారు. ఆ హీరో మరెవరో కాదు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. తనకు కూడా మురుగదాస్ తో సినిమా చేయాలని వుంది. ఈ విషయాన్ని ఇండైరెక్ట్ గా చాలా సందర్భాల్లో బన్నీబయటపెట్టాడు కూడా. `దర్బార్` తరువాత మరో సినిమా అంగీకరించని మురుగదాస్ ఆ మధ్య బన్నీకి లైన్ వినిపించారట. లైన్ నచ్చడంతో బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చి పూర్తి స్థాయి కథని సిద్ధం చేయమన్నారట.
గత కొన్ని నెలలుగా అదే పనిలో వున్న మురుగదాస్ .. బన్నీ పిలుపు కోసం ఎదురుచూస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. బన్నీ ఇటీవలే `పుష్ప` చిత్రంతో పాన్ ఇండియా హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం తన దృష్టి మొత్తం `పుష్ప 2` పైనే వుంది. జూలైలో పార్ట్ 2 ని పట్టాలెక్కించబోతున్నారట. ఇప్పటికే స్క్రిప్ట్ ని పక్కగా లాక్ చేసిన సుకుమార్ పార్ట్ 1 కి మించి మార్పులు చేర్పులు చేశారని, బడ్జెట్ ని కూడా 375 కోట్ల వరకు పెంచేశారని చెబుతున్నారు. ఈ మూవీ తరువాతే ఇతర సినిమాలపై బన్నీ దృష్టిపెట్టబోతున్నారు.
ఇక `పుష్ప` తరువాత అంగీకరించిన రెండు భారీ ప్రాజెక్ట్ లున్నాయి. అందులో ఒకటి కొరటాల శివ సినిమా కాగా మరొకటి బోయపాటి శ్రీను మూవీ. ఈ రెండు పూర్తయితే కానీ బన్నీ మురుగదాస్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం కుదరదు. అంతే కాకుండా మురుగదాస్ తెలుగులో చేసిన చిత్రాలన్నీ భారీ ఫ్లాపులయ్యాయి. ఈ నేపథ్యంలో బన్నీ తను లైన్ లో పెట్టుకున్న ప్రాజెక్ట్ లని పక్కన పెట్టి మురుగదాస్ ప్రాజెక్ట్ కు ఓకే చెబుతాడా అన్నది వేచి చూడాల్సిందే. అయితే ఇది పాన్ ఇండియా రేంజ్ లో వుంటుందని, బన్నీ కూడా ఈ ప్రాజెక్ట్ పై ఆసక్తిగా వున్నారని ఇన్ సైడ్ టాక్.