సోషల్ మీడియాలో 'సౌత్ కా సుల్తాన్' అనిపించుకున్న ఐకాన్ స్టార్..!

Update: 2022-01-14 08:16 GMT
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు సోషల్ మీడియాలో ఉండే ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా సినిమాకు క్రేజ్ పెంచుకుంటూ వెళ్తున్న బన్నీ.. సౌత్ ఇండస్ట్రీలో మరే హీరోకు సాధ్యం కాని రీతిలో ఫాలోయర్స్ ను పెంచుకున్నారు. ఈ క్రమంలో తాజాగా మరో అరుదైన ఘనత సొంతం చేసుకున్నారు. అల్లు అర్జున్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో 15 మిలియన్ ఫాలోయర్స్ మార్క్ ను అందుకున్నారు. సౌత్ ఇండస్ట్రీలో ఈ రికార్డు అందుకున్న తొలి హీరో బన్నీయే కావడం గమనార్హం. ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ తెరిచిన నాలుగున్నార ఏళ్లలోనే ఈ ఘనత అందుకోవడం విశేషం.

అల్లు అర్జున్ 2017, నవంబర్‌ లో అధికారికంగా ఇన్‌స్టాలోకి వచ్చారు. అప్పటి నుంచి క్రమం తప్పకుండా అభిమానులతో తన విషయాలను పంచుకుంటూనే ఉన్నారు. అంతేకాదు సోషల్ మీడియాలో తన సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్ కూడా పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్‌ ను సర్‌ప్రైజ్ చేస్తూ వచ్చారు. మెల్లమెల్లగా ఫాలోయర్స్‌ ను పెంచుకుంటూ.. ఇప్పుడు ఏకంగా 15 మిలియన్ మైలురాయిని అందుకున్నారు. దీంతో ఇప్పుడు అభిమానులు బన్నీని 'సౌత్ కా సుల్తాన్' అని పిలుస్తున్నారు.

సోషల్ మీడియా మాధ్యమాల్లో ఒకటైన ఇన్స్టాగ్రామ్ లో 15 మిలియన్ ఫాలోయర్స్ రావడంపై అల్లు అర్జున్ సంతోషం వ్యక్తం చేశారు. ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు అభిమానులకు మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. ఇక ట్విట్టర్‌ లోనూ బన్నీకి 6 మిలియన్ ఫాలోయర్స్ పైగా ఉన్నారు. అలాగే ఫేస్ బుక్‌ లో ఏకంగా 21 మిలియన్ ఫాలోయర్స్ పైగా సంపాదించుకోవడం విశేషం.

సౌత్ ఇండియాలో ఇప్పటికే స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న అల్లు అర్జున్.. 'పుష్ప' సినిమాతో పాన్ ఇండియన్ స్టార్‌ గా ఎదిగారు. 'పుష్ప: రి రైజ్' సినిమా అన్ని ఇండస్ట్రీల్లోనూ అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకుంది. ముఖ్యంగా నార్త్ ఆడియన్స్ బన్నీ పెరఫార్మెన్స్ కు ఫిదా అయ్యారు. ఈ క్రమంలోనే 2021లో అత్యధిక గాస్ రాబట్టిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. 'పుష్ప: ది రూల్' పై అంచనాలు రెట్టింపు అయ్యాయి.
Tags:    

Similar News