బన్నీ బ్రెయిన్ వాష్ చేస్తున్నాడట!

Update: 2019-02-09 09:55 GMT
అల్లు అర్జున్ రీసెంట్ గా తన ముద్దుల కూతురు అర్హా ఫన్నీ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఆ వీడియోకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ముద్దుల పాప అర్హను నాన్నకు నచ్చినవాడినే పెళ్ళి చేసుకోవాలని బన్నీ అడగడం.. అర్హ నేను చేసుకోనని రెండు సార్లు చెప్పడం అందరినీ ఆకర్షిస్తోంది. ఈ వీడియో కు చాలామంది కామెంట్స్ పెడుతున్నారు.

బన్నీ తమ్ముడు శిరీష్ కూడా రిప్లై ఇస్తూ "నువ్వు ఇప్పటినుంచే అర్హ కు బ్రెయిన్ వాష్ చేస్తున్నావు.. నువ్వో టిపికల్ దేశి ఫాదర్" అన్నాడు.  ఈ రిప్లైకి మంచి రెస్పాన్స్ వచ్చింది.  నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి ఈ కామెంట్ కు మూడు స్మైలీ ఎమోజీలు పెట్టారు. నెటిజనులు కొందరు అల్లు శిరీష్ చెప్పింది నిజమేనన్నారు. బన్నీ మాత్రం లవ్ మ్యారేజ్ చేసుకోవచ్చు.. అది కూడా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్.. కానీ ఇప్పుడు మాత్రం కూతురికి సరదాగానే అయినా ఇలా  నేర్పిస్తున్నాడు అంటూ చిర్రుబుర్రులాడారు.

ఒకరు "దేశి ఫాదర్ అయినా దేశముదురు కూతురు అక్కడ" అంటే మరొకరు "సినిమా చూపిస్త నాన్నా.. నీకు సినిమా చూపిస్త నాన్న" అంటూ పంచులతో రెచ్చిపోయారు.   శిరీష్ ఒక్కడే కాదు.. దాదాపుగా అందరూ అల్లు అర్హకే సపోర్ట్ చేయడం విశేషం.  ఎదేతేనేం ఈరోజు అల్లు అర్హ వీడియో సోషల్ మీడియాలో ఓ హాట్ టాపిక్ గా మారింది.
Tags:    

Similar News