తమ్ముడు నా దృష్టిలో ఎప్పుడో సక్సెస్ అయ్యాడు..!

Update: 2022-11-07 04:30 GMT
అల్లు శిరీష్, అను ఇమ్మాన్యుయెల్ లీడ్ రోల్స్ లో రాకేశ్ శశి డైరక్షన్ లో తెరకెక్కిన సినిమా ఊర్వశివో రాక్షసివో. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో ధీరజ్ ఈ మూవీ నిర్మించారు. అల్లు అరవింద్ సమర్పించిన ఈ మూవీ లాస్ట్ ఫ్రై డే రిలీజై యూత్ ఫుల్ ఎంటర్టైన గా సక్సెస్ అందుకుంది. అల్లు శిరీష్ కెరియర్ లో మొదటి స్ట్రైట్ సక్సెస్ ఫుల్ సినిమా ఇదే అని చెప్పొచ్చు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ అయ్యింది. అల్లు హీరో అందుకున్న ఈ విజయాన్ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు. ఆదివారం సాయంత్రం జె.ఆర్.సీ కన్వెన్షన్ లో ఊర్వశివో రాక్షసివో సినిమా సక్సెస్ మీట్ జరిగింది.   

ఈ ఈవెంట్ కి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గెస్ట్ గా వచ్చారు. ఇక వేడుకలో అల్లు అర్జున్ మాట్లాడుతూ.. ఈ సక్సెస్ తన ఫ్యామిలీకి చాలా స్పెషల్ అని.. తమ కుటుంబానికి ఇంత మంచి సక్సెస్ ఇచ్చిన ప్రేక్షకులకు ధన్యవాదాలు అని చెప్పారు. ఈ సినిమా సక్సెస్ మా ఫ్యామిలీకి ఎప్పుడూ గుర్తుండిపోతుందని అన్నారు. సినిమా డైరక్టర్ రాకేశ్ శశి ప్రతిభ కనబరిచారని.. సినిమా సక్సెస్ లో డైరక్టర్ పార్ట్ చాలా ముఖ్యమని. ఎంతమంది ఎంత బాగా చేసినా డైరక్టర్ సరిగా లేకపోతే సినిమా రిజల్ట్ తేడా కొడుతుందని అన్నారు అల్లు అర్జున్.        

మూవీలో నటించిన వారందరికి సినిమా సక్సెస్ సందర్భంగా కంగ్రాట్స్ చెప్పారు. హీరోయిన్ అను ఇమ్మాన్యుయెల్ తనతో లవర్ ఆల్సో ఫైటర్ ఆల్సో అనిపించింది ఇప్పుడు శిరీష్ తో ఊర్వశివో రాక్షసివో చేసింది. తనకు కూడా ఈ సినిమా సక్సెస్ బూస్టింగ్ ఇస్తుందని అన్నారు.

ఇక సినిమాకు పనిచేసిన టెక్నిషియన్స్ అందరికి కంగ్రాట్స్ అని.. ఇక చివరగా తమ్ముడు శిరీష్ గురించి మాట్లాడారు అల్లు అర్జున్. శిరీష్ గురించి చాలా మట్లాడాలని అనుకుంటాను కానీ దానికి కరెక్ట్ టైం రావాలని అనుకున్నా ఇదే ఆ మూమెంట్.

శిరీష్ హిట్టు కొట్టినా కొట్టకపోయినా తన దృష్టిలో ఎప్పుడో సక్సెస్ అయ్యాడని... నువ్వేమి చేయక్కర్లా.. నువ్వేం చేసినా చేయకపోయినా ఐలవ్యూ అన్నారు అల్లు అర్జున్. లైఫ్ ని తను జీవించే తీరు.. జీవితం గురించి తను ఆలోచించే విధానం గురించి తనకు చాలా హై రెస్పెక్ట్ ఉందని అన్నారు అల్లు అర్జున్.      

తమ్ముడి గురించి అన్నయ్య పొగడకపోతే ఎలా చెప్పండి. అది కూడా హిట్టు కొట్టాడు కాబట్టి తమ్ముడు శిరీష్ పై తన ప్రేమని చూపించాడు అల్లు అర్జున్. ఈమధ్య అల్లు ఫ్యామిలీ నుంచి అల్లు శిరీష్ దూరమయ్యాడంటూ కొన్ని వార్తలు వచ్చాయి. ఈ సినిమా సక్సెస్ తో ఆ వార్తలకు చెక్ పెట్టినట్టు అయ్యింది. అల్లు శిరీష్ కూడా ప్రస్తుతం తన సినిమా సక్సెస్ జోష్ ని ఎంజాయ్ చేస్తున్నాడు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News