కూత పెట్టడానికి బన్నీ రెడీ

Update: 2015-06-29 11:37 GMT
బోయపాటి శ్రీనును అల్లు అరవింద్‌ క్యాంప్‌ ఫుట్‌బాల్‌ ఆడేస్తోందా? సరిగ్గా ఫిలింనగర్‌లో ఇలాంటి వార్తలే వినిపిస్తున్నాయి. కానిలో వీటిల్లో అస్సలు నిజం లేదని తెలుస్తోంది. స్టార్‌ హీరోయిన్ల డేట్ల కోసమే స్టయిలిష్‌ స్టార్‌ ఇంతకాలం వెయిట్‌ చేశాడని.. ఎట్టకేలకు హీరోయిన్‌ విషయంలో ఇప్పుడొక క్లారిటీ రావడంతో త్వరలోనే షూటింగ్‌కు వెళుతున్నాడని టాక్‌.

నిజానికి ఈ సినిమాలో ఓ కొత్తమ్మాయిని హీరోయిన్‌గా తీసుకోవాలని అనుకున్నారు. అయితే కొత్త ఫేస్‌లు రెగ్యులర్‌ కమర్షియల్‌ ప్రాజెక్టులకు కాస్త ఇబ్బందేకాబట్టి.. చివరకు మళ్ళీ పాత హీరోయిన్‌వైపే మొగ్గు చూపారు. అయితే సమంత, కాజల్‌, తమన్నాలు రొటీన్‌ అయిపోవడంతో.. కొత్త రక్తంలో ముందుకెళ్ళాలని డిసైడ్‌ అయ్యారట అల్లు అరవింద్‌. సడన్‌గా మహేష్‌ బాబు సినిమా వదులుకొని డేట్స్‌ ఖాళీ చేసుకోవడంతో, వెంటనే రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆ ఛాన్స్‌ ఇచ్చేశారు. ఈమె ఓ వారం రోజులు ఎన్టీఆర్‌ సినిమా షూటింగ్‌లో పాల్గొని, జూలై 19 నుండి బన్నీ-బోయపాటి సినిమా షూటింగ్‌ వచ్చేస్తుంది. ఆ రోజు నుండే ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ స్టార్టయ్యేది.

క్లాస్‌ హీరోగా పేరొందిన బన్నీ, మాస్‌ సినిమాలు తీయడంతో దిట్ట అయిన బోయపాటి శ్రీను.. ఈ కాంబినేషన్‌ పేరు వింటుంటేనే చాలా డిఫరెంట్‌గా అనిపిస్తోంది. సో, వీళ్ళు ఏం మ్యాజిక్‌ చేస్తారో చూడాలి మరి.

Tags:    

Similar News