అల్లు ఫ్యాన్స్ యాక్టివ్ అయిపోతున్నారట

Update: 2017-01-29 09:30 GMT
అల్లు అర్జున్ తన కెరీర్ మలుచుకుంటున్న తీరును అద్భుతం అనాల్సిందే. ఒక్కో సినిమాకి తన రేంజ్ పెంచుకుంటూ దూసుకుపోతున్నాడు. బన్నీ మూవీ మినియం 50 కోట్లు రాబట్టేస్తుందనే విషయం ఇప్పుడు ఇండస్ట్రీ అంతా ఒప్పుకోవాల్సిందే అయితే.. ఇదే సమయంలో మెగా హీరోగా మాత్రమే కాకుండా.. అల్లు హీరోగా కూడా బ్రాండ్ నేమ్ పెంచుకునేందుకు అల్లు అర్జున్ ప్రయత్నిస్తున్నాడనే మాటలు ముందు నుంచీ వినిపిస్తూనే ఉన్నాయి.

ఫ్యాన్ బేస్ ను పెంచుకోవడం కోసం బన్నీ చేస్తున్న ఎటెంప్ట్స్ కూడా అలాగే ఉన్నాయి. రీసెంట్ గా అల్లు అర్జున్ తన అభిమానులతో ఓ స్పెషల్ మీటింగ్ ఏర్పాటు చేశాడని తెలుస్తోంది. దీనికి అన్ని జిల్లాల నుంచి బన్నీ హార్డ్ కోర్ ఫ్యాన్స్ హాజరయ్యారట. తనతో పాటు సోదరుడు శిరీష్ పేరిట అల్లు ఫ్యాన్స్ యాక్టివిటీస్ పెంచడం దీని ప్రధానోద్దేశ్యంగా చెబుతున్నారు. గీతా ఆర్ట్స్ ఆఫీస్ లోనే ఈ మీటింగ్ జరిగిందని తెలుస్తోంది. ఇకపై అల్లు ఫ్యాన్స్ యాక్టివిటీస్ ని తన భార్య స్నేహారెడ్డి సోదరుడు చూసుకుంటాడని చెప్పాడట.

అతని ద్వారా తనకు ఏ సమాచారం అయినా అందించాలని.. ఇకపై పూర్తిగా యాక్టివ్ గా ఉండాలని.. ఫ్యాన్స్ అసిసయేషన్ల ఏర్పాటు.. వాటి కార్యకలాపాలతో టచ్ లో ఉండాలని చెప్పాడట అల్లు అర్జున్. ఇంతకీ ఇదంతా ఎందుకంటారూ! ఇదంతా అల్లు అరవింద్ కి తెలిసేలా జరుగుతుండడమే ఆశ్చర్యకరం. అల్లు అరవింద్ మాస్టర్ బ్రెయిన్ నుంచి వచ్చిన ఐడియానే ఇధి కూడా అంటున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News