`పుష్ప ది రైజ్` తో పాన్ ఇండియా స్టార్ గా అవతరించిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండవ భాగం షూటింగ్ కి రెడీ అవుతున్నారు. ఆగస్టులో షూటింగ్ ప్రారంభం అవుతుంది. షూటింగ్ సహా అన్నిరకాల పనులు పూర్తిచేసి వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందకు తీసు కురానున్నారు. అంత వరకూ బన్నీ ఏ డైరెక్టర్ కి డేట్లు ఇచ్చే ప్రశక్తి లేదు. నిర్మాతలు అడ్వాన్సులు ఇస్తామన్నా? తీసుకోవడం లేదు.
ఖాళీ సమయం కుదిరితే కథలు వింటున్నాడు. వాటిని లాక్ చేయడం వరకే పరిమితం. మొత్తంగా అది ఇప్పటివరకూ బన్నీ గురించి మనకు తెలిసింది. కానీ పుష్ప మొదటి భాగం రిలీజ్ అయిన దగ్గర నుంచి బన్నీ ఏమాత్రం ఖాళీ లేకుండా బిజీగా గడుపుతున్నాడు అన్న విషయం ఆలస్యంగా వెలుగులో కి వచ్చింది.
పుష్ప రిలీజ్ అయి ఎనిమిది నెలలు గడుస్తున్నా? బన్నీ ఆదాయం ఏమాత్రం తగ్గలేదని ఆలస్యంగా వెలుగులోకి వస్తోంది. ఆ సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి బన్నీ కేవలం నెల రోజులు మాత్రమే విశ్రాంతి తీసుకున్నాడని..మిగిలిన సమయంలో కమర్శియల్ యాడ్స్ షూట్ లో బిజీ బిజీగా గడుపుతున్నట్లు తెలిసింది.
తన ముందుకొచ్చిన ఎండార్ మెంట్ ని విడిచి పెట్టకుండా యాడ్ షూట్ లో పాల్గొంటున్నాడు. ఆ యాడ్ షూట్ విషయంలోనూ బన్నీ నయా దర్శకుల్నే దించుతున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో ఆ మధ్య థాయ్ లాండ్ లో ఓ యాడ్ చేసారు. అలాగే సుకుమార్...త్రివిక్రమ్ తో కూడా యాడ్స్ చేస్తున్నాడు. ఇవన్నీ కూడా కమర్శియల్ యాడ్స్ అని..వాటి ద్వారా కోట్ల రూపాయల ఆదాయం బన్నీ ఖాతాలో జమ అయినట్లు తెలుస్తోంది.
అయితే ఈ ఎండార్ మెంట్స్ అన్నీ కూడా పుష్ప రిలీజ్ తర్వాత వచ్చినవి గానే తెలుస్తోంది. ఆ సినిమా పాన్ ఇండియాలో పెద్ద సక్సెస్ అవ్వడం..ముఖ్యంగా హిందీ బెల్ట్ లో అసాధారణమైన వసూళ్లు రాబట్టడంతోనే నయా బ్రాండింగ్ లు అన్ని బన్నీ వెంట పడినట్లు తెలుస్తోంది.
మరి మొదటి భాగంతోనే ఈ రేంజ్ లో పాపులర్ అయితే `ది రూల్` తర్వాత బన్నీ క్రేజ్ రెట్టింపు అవ్వడం ఖాయం. తదుపరి హృతిక్ రోషన్ తరహాలో మరిన్ని బ్రాండింగ్ లతో ముందుకొచ్చే అవకాశం లేకపోలేదు. మొత్తానికి బన్నీ బ్రాండ్ ఇమేజ్ పీక్స్ కి చేరినట్లు కనిపిస్తుంది.