ఆ హ‌గ్గు వెన‌క అంత సైన్స్ దాగి ఉందా?

Update: 2020-01-13 05:05 GMT
సంక్రాంతి పందెం ర‌క్తి క‌ట్టిస్తోంది. నువ్వా నేనా? అంటూ సాగిన పోరులో కొంద‌రికి మిశ్ర‌మ స్పంద‌న‌లు మ‌రికొంద‌రికి పాజిటివ్ స్పంద‌న‌లు క‌నిపిస్తున్నాయి. బ‌న్ని న‌టించిన `అల వైకుంఠ‌పుర‌ములో` చిత్రానికి అన్ని వైపులా పాజిటివ్ రెస్సాన్స్ వ‌స్తోంది. తొలి రోజు మంచి  ఓపెనింగ్ లు రాబ‌ట్టుకోవ‌డంతో పాటు.. పాజిటివ్  రివ్యూలతో సినిమాకు కావాల్సినంత బూస్ట్ దొరికింది. అమెరికా వ‌సూళ్లు బాగున్నాయి. ప్రీమియ‌ర్ షో ల  ద్వారానే బాక్సాఫీస్ ను షేక్ చేసింది. తెలుగు  రాష్ట్రాల్లో రిపోర్ట్ రావాల్సి ఉంది. ఏడాదిన్న‌ర గ్యాప్ తీసుకుని బ‌న్ని ఎంతో కాన్ఫిడెంట్ గా  చేసిన ఈ సినిమా రిజ‌ల్ట్ ఎలా ఉంది? అన్న‌ది తెలియాలంటే బ‌న్నీలో జోష్ ఎంతో ప్ర‌త్య‌క్షంగా చూస్తే అర్థ‌మ‌వుతుంది.

నిన్న‌టిరోజున స‌క్సెస్ మీట్ లో బ‌న్నిలో ఆ ఉత్సాహం క‌నిపించింది. త‌న‌ న‌మ్మ‌కాన్ని త్రివిక్ర‌మ్ నిల‌బెట్టాడు. అందుకే సెల‌బ్రేష‌న్స్ లో భాగంగా ఆప్యాయంగా  త్రివిక్ర‌మ్ కి బ‌న్నీ స్ట్రాంగ్ హ‌గ్ ఇచ్చాడు. సినిమా లో త్రివిక్ర‌మ్ డైలాగులు.. బ‌న్ని పెర్పామెన్స్.. థ‌మ‌న్ సంగీతం పై స‌ర్వ‌త్రా హ‌ర్షం వ్య‌క్తం అవుతోంది. ఈ కాంబినేష‌న్ బెస్ట్ మూవీగా నిలిచి పోతుంద‌ని అభిమానులు భావిస్తున్నారు. ఇక‌ సంక్రాంతి సెల‌వులు రిలీజైన అన్ని సినిమాల‌కు క‌లిసి రానున్నాయి. సోమ‌- మంగ‌ళ‌- బుధ‌- గురువారం వ‌రుస‌గా సెల‌వులు. పాజిటివ్ టాక్ నేప‌థ్యంలో ఈ నాలుగు రోజులు హౌస్ ఫుల్ క‌లెక్ష‌న్ల‌తో అల టీమ్ దూసుకు పోతుంద‌నే అంచ‌నా వేస్తున్నారు.

బ‌న్నీ చిత్రానికి పోటీగా మ‌హేష్ న‌టించిన స‌రిలేరు నీకెవ్వ‌రు ఉన్నా! ఏ సినిమా వ‌సూళ్లు ఆ సినిమాకు  ఉంటాయ‌ని ఇరు బృందాలు ఎవ‌రికి వారు ధీమాగా ఉన్నారు. ఇరు సినిమాల తొలి వీకెండ్ రిపోర్ట్ ఏమిటి.. సోమ‌వారం నుంచి వ‌సూళ్ల రేంజ్ ఎలా ఉండ‌నుంది? ఎవ‌రిది పైచేయి? అన్న‌ది కాస్త ఆగితే కానీ తేల‌దు. ఇప్ప‌టికైతే  నా పేరు సూర్య డిజాస్ట‌ర్ రిజ‌ల్ట్ త‌ర్వాత ఏడాదిన్న‌ర వెయిట్ చేసి త్రివిక్ర‌మ్ కే ఫిక్స్ అయినందుకు బ‌న్ని ఉత్సాహంలోనే ఉన్నాడ‌ని ఆ హ‌గ్ చెబుతోంది. ఎదుటివారికి మ‌నం ఇచ్చే షేక్ హ్యాండ్ .. హ‌గ్ ఎంత స్ట్రాంగా ఉంటే అంత మ్యాట‌ర్ ఉన్న‌ట్టు. ఆ మ్యాట‌ర్ గురూజీ కి బ‌న్ని ఇచ్చిన హ‌గ్గులో క‌నిపించింది మ‌రి.
Tags:    

Similar News