ఖుషీ చెయ్యి బన్నీ.. వై దిస్‌ కొలవెరి?

Update: 2016-05-16 17:30 GMT
ఇప్పుడు.. బన్నీ మాటికి బన్నీ రివ్యూలు చదవడం మానేశా అంటూ సెటైర్‌ వేసి వెళ్ళిపోయాడు సరే. కాకపోతే అసలు రివ్యూల్లో ఉన్న పాజిటివ్‌ ఎలిమెంట్లను కూడా తీసుకోవడం మానేస్తున్నా అంటే.. అది తనకు నష్టం చేకూర్చదను కాని.. వచ్చే లాభాన్ని మిస్‌ చేస్తుంది. ఎందుకంటే సన్ ఆఫ్‌ సత్యమూర్తి.. సరైనోడు సినిమాలకు రివ్యూలు పూర్‌ గా ఉన్నా కలెక్షన్లు అదిరిపోయాయ్‌ కాబట్టి.. మనోడు రివ్యూలు చదవను అంటున్నాడు. కాని మరి అర్బన్‌ ఆడియన్స్‌ అండ్‌ మాస్‌ అనేంత డిఫరన్స్‌ తెలియకుండా ఇక్కడ ఎవరు రివ్యూలు రాస్తున్నారని.. మనోడు అలా హార్ష్ కామెంట్లు చేస్తున్నాడు.

ఒక విషయం డిస్కస్‌ చేద్దాం. ఇప్పుడు స్టార్‌ వార్స్‌ః ఫోర్స్ ఎవేకన్స్ అనే సినిమా ఉందనుకోండి.. అక్కడి రివ్యూవర్లు సినిమా యావరేజ్‌ అన్నారు. మనం కూడా కథగా చూసుకుంటే.. అందులో పెద్ద మ్యాటర్‌ ఏమీ ఉండదు. కాకపోతే స్పెషల్‌ ఎఫెక్టులన్నీ అదిరిపోతాయ్‌. ఇక సినిమాకు 14 వేల కోట్ల రూపాయల పైమారు వరల్డ్ వైడ్‌ గ్రాస్‌ వచ్చింది. అందుకుని.. రివ్యూలు తప్పు.. సినిమా సూపరు అనాలా? రివ్యూవర్‌ రాసేది.. సినిమాటిక్‌ ఫీల్‌ ఎలా ఉందో తెలిపే తన అభిప్రాయం. ఒక్కోసారి అలాంటి రివ్యూల కారణంగా చాలా తెలుసుకోవచ్చు. ఆ మాటకు వస్తే.. రుద్రమదేవి సినిమాలో బన్నీ యాసతో కూడిన మాస్‌ రోల్‌ బాగుందని రాశాకనేగా.. మనోడు బోయపాటి శ్రీను తో సరైనోడు సినిమా చేయాలని ఫిక్సయ్యింది.. కాదంటారా?

ఇకపోతే.. రివ్యూర్లకు నచ్చకపోతే ఏంటి.. జనాలకు నచ్చుతుంది అనే బదులు.. ఇటు రివ్యూవర్లకు అటు జనాలకు నచ్చే సినిమాలు తీయొచ్చుగా? మొన్న వచ్చిన ''24'' సినిమానే తీసుకోండి.. అటు ఆడియన్స్‌ కు పిచ్చపిచ్చిగా నచ్చితే.. సినిమాలోని అద్భుతమైన స్ర్కీన్‌ ప్లే వంటి అంశాలను క్రిటిక్స్ ను శాటిస్ఫై చేశాయి. ఇద్దరినీ ఖుషీ చేయాలని గాని.. వై దిస్‌ కొలవెరి నానా?

Tags:    

Similar News