రోజులు గడుస్తున్న కొద్దీ పుష్ప రాజ్ అరాచకాలు పెచ్చుమీరుతున్నాయ్! రోజుకో డీల్ తో రచ్చ రచ్చ చేస్తున్నాడు! ఒక్కో డీల్ కోసం కోట్లలో పారితోషికాలు అందుకుంటున్నాడు. మొత్తానికి పుష్ప విజయం అతడిని అందనంత ఎత్తుకు తీసుకెళుతోంది. పుష్ప 2 ప్రారంభం కాకముందే అతడు వరుసగా భారీ కాంట్రాక్టులతో దుమారం రేపుతున్నాడు.
'ఏయ్ బిడ్డ ఇది నా అడ్డా' అన్న చందంగా పుష్ప అన్నిచోట్లా ఏల్తున్నాడు. ఎర్రచందనం దొంగ ఆట పెద్దగానే వర్కవుటవుతోంది. గత రెండు రోజులుగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటర్నెట్ లో సంచలనంగా మారుతున్నాడు. ఇంతకుముందు న్యూయార్క్ లో జరిగిన వార్షిక ఇండియన్ డే పరేడ్ లో అల్లు అర్జున్ గ్రాండ్ మార్షల్ వద్ద దేశం తరపున ప్రాతినిధ్యం వహించాడు.
మన బన్ని న్యూయార్క్ మేయర్ ని సైతం ప్రభావితం చేశాడు. 'తగ్గేదే లే' అనిపించాడు. న్యూయార్క్ మేయర్ తో బన్ని సెల్ఫీ కూడా వైరల్ అయ్యింది. తదుపరి అర్మాన్ మాలిక్ తో అల్లు అర్జున్ మ్యూజిక్ వీడియో 'మేం ఆగము' కూడా వైరల్ గా మారింది.
స్టైలిష్ స్టార్ తో కలిసి ఈ మ్యూజిక్ వీడియోలో కొందరు ఆసియన్ బ్యూటీస్ డ్యాన్సులు చేయడం ఆకట్టుకుంది. ఇది ప్రఖ్యాత కోలా బ్రాండ్ ప్రకటన. తాజాగా అల్లు అర్జున్ 'పెరి పేరి చికెన్' అంటూ ప్రఖ్యాత మాంసపు చిప్స్ విక్రయ బ్రాండ్ కి ప్రచారం చేసాడు. పుష్ప స్లాంగ్ లో బన్నీ ప్రకటన యువతరంలోకి దూసుకెళుతోంది.
'పుష్ప 2: ది రూల్' ప్రారంభోత్సవానికి ముందు బన్నీ నిరంతరం హెడ్ లైన్స్ లో ఉండేలా జాగ్రత్త పడ్డాడు. ఇదంతా వ్యూహాత్మకం. ఇంతలోనే తాజా అప్ డేట్ ప్రకారం... 'పుష్ప 2' అధికారికంగా ప్రారంభమైంది. ఈ రోజు పూజా కార్యక్రమం జరిగింది. పుష్ప ఇక సెట్స్ లో పూర్తిగా బిజ అయిపోతాడు.
సుకుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇక కేఎఫ్ సీకి కోలా బ్రాండ్లకు ప్రచార కాంట్రాక్టుల రూపంలో బన్నీ భారీ మొత్తాలను అందుకుంటున్నాడని గుసగుస వినిపిస్తోంది. బన్ని ఇప్పుడు నేషనల్ క్రష్ గా మారాడు. అందుకే కార్పొరెట్ బ్రాండ్లు అతడి వెంట క్యూ కడుతున్నాయి. మునుముందు పాన్ ఇండియా కేటగిరీలో వెలుగుతున్న మన యువహీరోలకు ఇలాంటి అవకాశం ఉంటుందనే ఆశిద్దాం.
Full View