టాలీవుడ్లో అత్యధిక మంది హీరోలున్న కుటుంబం ‘మెగా’ వారిదే. ఒక క్రికెట్ జట్టుకు సరిపోయేంత మంది హీరోలు ఆ ఫ్యామిలీలో ఉన్నారన్నది కేవలం జోక్ కాదు. నిజం. ఇంతమంది హీరోలున్నా చాలా వరకు యూనిటీ చూపిస్తుంటారు కానీ.. ఈ మధ్య మాత్రం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అని.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అని వేరు కుంపట్లు నడుస్తున్న భావన జనాల్లో కలుగుతోంది. ముఖ్యంగా బన్నీ విషయంలో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. అందులోనూ పవన్ కళ్యాణ్ అభిమానులకు వ్యతిరేకంగా మాట్లాడినప్పటి నుంచి అతను పవర్ స్టార్ అభిమానులకు శత్రువు అయిపోయాడు. దీంతో అభిమానుల్లో కలహాలు మొదలయ్యాయని.. మెగా అభిమానులు వర్గాలుగా విడిపోయారని.. రకరకాల ప్రచారాలు నడుస్తున్నాయి. దీనిపై ఒక ఇంటర్వ్యూలో బన్నీ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
మెగా ఫ్యామిలీ హీరోల అభిమానుల్లో గొడవలు లేనని తాను అననని బన్నీ చెప్పాడు. మెగా ఫ్యామిలీ అనేది చాలా పెద్ద కాంపౌండ్ అని.. ఇక్కడ చాలామంది హీరోలున్నారని అతనన్నాడు. చిరంజీవి.. పవన్ కళ్యాణ్.. చరణ్.. వరుణ్.. సాయిధరమ్ తేజ్.. శిరీష్.. ఇలా ఎవరికి వాళ్లకు ఫ్యాన్స్ ఉన్నారని.. ఒక్కొక్కరికి ఒక్కొక్కరు నచ్చుతారని.. అలాంటపుడు చిన్న చిన్న గొడవలు మామూలే అని బన్నీ అభిప్రాయపడ్డాడు. పవన్ కళ్యాణ్ వచ్చిన కొత్తలో ఆయనకంటూ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడ్డాక.. చిరంజీవి ఫ్యాన్స్.. పవన్ ఫ్యాన్స్ మధ్య గొడవలు జరగడం తాను చూశానని.. అభిమానుల మధ్య కొన్నిసార్లు అపార్థాలు వస్తాయని.. మళ్లీ కలిసిపోతుంటారని.. ఇవన్నీ తాత్కాలికమే అని బన్నీ అన్నాడు. మొత్తానికి మెగా ఫ్యామిలీ ఫ్యాన్ వార్స్ గురించి బన్నీ ఇలా ఓపెనవడం ఆశ్చర్యం కలిగించే విషయమే.