స్టార్ హీరోయిన్ సమంత లీడ్ రోల్ లో గుణశేఖర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న పౌరాణిక చిత్రం శాకుంతలం. మహాభారతంలోని కథ ఆధారంగా ఈ సినిమాని గుణశేఖర్ ప్రేమకావ్యంగా తెరకెక్కించారు. శాకుంతల, దుష్యంతుడి ప్రేమ కథని అద్బుతంగా ఆవిష్కరించే ప్రయత్నం చేశాడు.
శాకుంతల దృక్కోణం నుంచి ఆమెని సినిమాలో మెయిన్ లీడ్ గా చేసి ఈ సినిమా కథని గుణశేఖర్ చెప్పబోతున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే ప్రేక్షకుల ముందుకి వచ్చిన టీజర్ ప్రేక్షకులకి భాగా కనెక్ట్ అయ్యింది.
అలాగే శాకుంతల పాత్రలో సమంత కూడా దేవకన్యలా ఉందనే ప్రశంసలు వస్తున్నాయి. ఆ పాత్రలో ఆమె పరకాయ ప్రవేశం చేసి శాకుంతల పాత్రకి ప్రాణం పోసింది అనే మాట వినిపిస్తుంది.
ఇక అప్పటి వాతావరణం, ప్రకృతి అందాలని తెరపై విజువల్ ఎఫెక్ట్స్ తో అద్బుతంగా ఆవిష్కరించారు. ఈ టీజర్ తో శాకుంతలం సినిమాపై అమాంతం అంచనాలు పెరిగిపోయాయి. ముఖ్యంగా భారతీయ ఇతిహాస కథలు ఇష్టపడే వారికి శాకుంతలం స్టొరీ కచ్చితంగా నచ్చుతుంది అనే మాట ఇప్పుడు వినిపిస్తుంది. ఇక శాకుంతల, దుష్యంతుడికి పుట్టిన భరతుడు పాత్రలో అల్లు
అర్జున్ కూతురు అర్హ నటించిన సంగతి తెలిసిందే. శాకుంతలంకి కొనసాగింపుగా భరతుడు పాత్ర సినిమాలో ఉండబోతుంది. చిన్నప్పటి భరతుడు పాత్రలో అర్హ తెరంగేట్రం చేసింది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఆ పాత్ర కోసం అర్హనే డబ్బింగ్ కూడా చెప్పుకోవడానికి రెడీ అవుతూ ఉండటం విశేషం.
నిజానికి పౌరాణిక కథలకి సంభాషణ కాస్తా గ్రాంధికంగా అచ్చమైన తెలుగు భావంతో వినిపించాలి. అలాంటి సంభాషణలు చెప్పడం అంత తేలికైన విషయం కాదు. కాని అర్హ మాత్రం తండ్రి వారసత్వాన్ని పునికి పుచ్చుకొని డబ్బింగ్ చెప్పడానికి రెడీ అవుతూ ఉండటం విశేషం. అల్లు అర్జున్ తన ఫోన్ లో అర్హ డబ్బింగ్ చెబుతున్న వీడియో స్టేటస్ గా పెట్టుకున్నారు. ఈ నేపధ్యంలో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.