AAA సినిమాస్.. ఇది అసలు ట్విస్ట్!

Update: 2019-02-13 09:35 GMT
టాలీవుడ్ స్టార్ హీరోలు ఈమధ్య మల్టిప్లెక్స్ బిజినెస్ లో ఎంట్రీ ఇవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్న సంగతి తెలిసిందే.  మహేష్ బాబు ఆల్రెడీ ఏషియన్ గ్రూప్ తో కలిసి ఎఎంబీ సినిమాస్ బ్రాండ్ తో మొదటి మల్టిప్లెక్స్ ను ప్రారంభించాడు.  మహేష్ బాటలో అల్లు అర్జున్ కూడా ఏషియన్ వారితో కలిసి మల్టిప్లెక్స్ చెయిన్ నెలకొల్పే ఆలోచనలో ఉన్నాడని ఇప్పటికే వార్తలు వచ్చాయి.  

హైదరాబాద్ అమీర్ పేట్ లోని సత్యం థియేటర్ ఉన్న స్థలాన్ని అల్లు అర్జున్ - ఏషియన్ గ్రూప్ వారు కలిసి సొంతం చేసుకున్నారు.  ఈ స్థలంలోలోనే AAA సినిమాస్ మల్టిప్లెక్స్ రానుందని సమాచారం. ఎఎఎ అనగానే మీరు ఏషియన్ అల్లు అర్జున్ సినిమాస్ అని అనుకుంటే పొరపాటుపడినట్టే.  ఎందుకంటే ఈ మల్టిప్లెక్స్ పేరు ఏషియన్ అల్లు అరవింద్ సినిమాస్ అని ఫిక్స్ చేశారట.  అంటే బన్నీ తన పేరు కాదు.. నాన్నగారిపేరుతో మల్టిప్లెక్స్ ఏర్పాటు చేస్తున్నాడన్నమాట. ఇప్పటికే దీనికి సంబంధించిన అగ్రిమెంట్స్ కూడా పూర్తయ్యాయట.

మహేష్ బాబు తరహాలోనే ఎఎఎ సినిమాస్ ను కూడా చైన్ మల్టిప్లెక్స్ బ్రాండ్ లాగా విస్తరించాలనే భారీ ప్లాన్ తో ఉన్నాడట అల్లు అర్జున్.  అల్లు అర్జున్ ఈమధ్య బిజినెస్ పై ఫోకస్ పెంచాడు. ఇప్పటికే బీ-డబ్స్ అనే ఒక రెస్టారెంట్ నడుపుతున్న బన్నీ మల్టిప్లెక్స్ చైన్ తో పాటుగా సొంత బ్యానర్ స్థాపించి సినిమా నిర్మాణం చేపట్టే ప్రయత్నాలలో కుడా ఉన్నాడట. 
Tags:    

Similar News