ఫిల్మ్‌ఫేర్‌లో ఐదు అవార్డులు గెలుచుకొని 'మనం' సత్తా చాటింది. ఆ అవార్డులతో మరోసారి ఏఎన్నార్‌ని గుర్తు చేసుకొనే అవకాశం కలిగింది. ఏఎన్నార్ నటించిన చివరి చిత్రం ఇదే కావడంతో ఫిల్మ్‌ఫేర్‌లో ఘనంగా నివాళి అర్పించారు. ఉత్తమ చిత్రంగా ఎంపికవడంతో అందుకు సంబంధించిన అవార్డుని నాగార్జున స్వయంగా స్వీకరించారు. ఆయన వేదికపై భావోద్వేగానికి గురవుతూ మాట్లాడారు.
మనం' కోసం తన కుటుంబం ఎంత కష్టపడిందీ, ఆ చిత్రంతో తమ కుటుంబానికున్న అనుబంధం గురించి ఫిల్మ్‌ఫేర్ వేడుకలో నాగార్జున చెప్పినట్టు తెలిసింది. ఆ రకంగా 'మనం' మరోసారి ఏఎన్నార్ లైవ్స్‌ఆన్ అనిపించింది. అయితే ఉత్తమ నటుడిగా తనకు అందించిన ఫిల్మ్‌ఫేర్‌ని కూడా అల్లు అర్జున్ ఏఎన్నార్‌కి అంకితం చేసి మరింత ఘనంగా నివాళి అర్పించారు. 'రేసుగుర్రం' చిత్రానికిగానూ అల్లు అర్జున్‌కి ఉత్తమ నటుడి పురస్కారం దొరికింది. అది ఏఎన్నార్‌కి అంకితమివ్వడం బాగుందని అంతా మెచ్చుకొంటున్నారు.