స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ కు కేవలం తెలుగులోనే కాదు.. మళయాళంలోనూ మంచి క్రేజ్ ఉంది. అక్కడి జనాలు అతడిని ప్రేమగా మల్లు అర్జున్ అని పిలుచుకుంటారు. అందుకే అల్లు అర్జున్ సినిమాలన్నీ మళయాళంలోకి డబ్ అవుతుంటాయి. తాజాగా హిందీలోనూ అతడికి క్రేజ్ పెరుగుతోంది. హిట్టు.. ఫ్లాపులతో సంబంధం లేకుండా నార్త్ లో అతడిని ఇష్టపడే వారి సంఖ్య పెరుగుతోంది.
అల్లు అర్జున్ రీసెంట్ గా హీరోగా నటించిన సరైనోడు - డీజే : దువ్వాడ జగన్నాథమ్ సినిమాలను ఈమధ్య హిందీలోకి డబ్ చేశారు. వాటిని యూట్యూబ్ లోనూ అప్ లోడ్ చేశారు. రెండు సినిమాలూ అతి తక్కువ టైంలోనే 50 మిలియన్ వ్యూస్ రికార్డులు బద్దలు కొట్టాయి. ఇందులో విశేషమేంటంటే 50 మిలియన్ వ్యూస్ మైలు రాయిని చేరుకోవడానికి సరైనోడుకు 42 రోజులు పట్టింది. అదే దువ్వాడ జగన్నాథమ్ ఈ ఫీట్ ను పదిహేను రోజుల్లోనే సాధించేసింది. ఇంత తక్కువ టైంలో ఇంత భారీ వ్యూస్ సాధించిన హీరో అల్లు అర్జునే కావడం విశేషం. ఇక్కడ ఇంకో విశేషమేంటంటే... బన్నీ హీరోగా బోయపాటి శ్రీను డైరెక్షన్ లో వచ్చిన సరైనోడు బంపర్ హిట్ కొట్టింది. హరీష్ శంకర్ డైరెక్షన్ లో వచ్చిన దువ్వాడ జగన్నాథమ్ మాత్రం ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. కానీ యూట్యూబ్ లో మాత్రం ప్రేక్షకులంతా దువ్వాడ జగన్నాథమ్ పైనే ఎక్కువగా ఆసక్తి చూపారు.
ప్రస్తుతం అల్లు అర్జున్ రైటర్ వక్కంతం వంశీ డైరెక్షన్ లో నా పేరు సూర్య సినిమా చేస్తున్నాడు. ఇందులో బన్నీది మిలటరీ ఆఫీసర్ పాత్ర. మళయాళ ముద్దుగుమ్మ అను ఇమ్మానుయేల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా రిలీజ్ కోసం తెలుగు - మళయాళ ప్రేక్షకులతో పాటు హిందీ ప్రేక్షకులు కూడా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.