వీడియో టాక్: బన్నీ గ్రేస్.. పూజ క్లాస్

Update: 2017-05-29 13:43 GMT
ఇప్పుడు అల్లు అర్జున్ ''డిజె దువ్వాడ జగన్నాథమ్'' సినిమా నుండి వరుసగా సాంగ్స్ అన్నీ రిలీజ్ చేయడం స్టార్ట్ చేశారు. గతంలో ఎలాగైతే సరైనోడు సినిమాకు ఆడియో రిలీజ్ లేకుండా కేవలం పాటలను యుట్యూబ్ లో రిలీజ్ చేసి తరువాత ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారో ఇప్పుడు కూడా అదే రూటు ఫాలో అవుతున్నారు. ఈసారి కాస్త ముందుగానే వీడియో సాంగులను కూడా రిలీజ్ చేసేస్తున్నారండోయ్.

ఇప్పుడు 'గుడిలో బడిలో మదిలో ఒడిలో' అంటూ ఒక సాంగు తాలూకు వీడియోతో సహా రిలీజ్ చేశారు. దేవిశ్రీ ప్రసాద్ మార్కు బీటుతో.. కాస్త నెమ్మదిగా సాగే ఈ పాటలో ఒక సిగ్నేచర్ స్టెప్ కూడా పెట్టారులే. ఇకపోతే ఎప్పటిలాగానే బన్నీ తన గ్రేస్ తో ఇంప్రెస్ చేశాడు. స్టెప్పు పెద్దగా కొత్తగా ఉండకపోయినా కూడా.. అందులో గ్రేస్ మాత్రం అదిరిపోయింది. ఇకపోతే హీరోయిన్ పూజా హెగ్డే తన క్లాస్ లుక్కుతో అదరగొట్టింది. రసరమ్యంగా కనిపించే ఆమె ఫిజిక్ తో బన్నీకి పోటీగా డ్యాన్సులు వేస్తుంటే.. అబ్బబ్బా అదో వింత కవ్వింపు అంతే.

ప్రత్యేకంగా ఆ పాట గురించి చెప్పాల్సిన మరో విషయం ఏంటంటే.. ఈ పాటను అబు దాబిలో షూట్ చేశారు. ఈ మధ్య కాలంలో అక్కడకు వెళ్ళి షూట్ చేసిన తెలుగు సినిమా ఇదే. అయాంక బోస్ సినిమాటోగ్రాఫీ కూడా చాలా బాగుందనే చెప్పాలి. చూద్దాం మరి త్వరలో ఈ పాట ఎటువంటి రికార్డులు సృష్టిస్తుందో!!


Full View
Tags:    

Similar News