అల్లు అర్జున్ లేటెస్ట్ ఫిలిం దువ్వాడ జగన్నాథమ్ తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్లు బాగానే వసూలు చేస్తున్నప్పటికీ ఓవర్సీస్ లో మాత్రం పెద్దగా ఆదరణ లభించడం లేదు. తెలుగుతో పాటు మళయాళంలోనూ తెగ క్రేజ్ సంపాదించుకున్న బన్నీ ఎన్ఆర్ఐ లను ఎందుకో పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాడు. ప్రస్తుతం పెద్ద సినిమాలకు ఓవర్సీస్ కలెక్షన్లు కీలకంగా మారాయి. అందుకే అల్లు అర్జున్ తోపాటు సినిమా టీం కూడా యూఎస్ లో డీజేను బాగానే ప్రమోట్ చేశారు. అయినా పెద్దగా ప్రయోజనం కనిపించలేదు.
డీజే సినిమా ఈ వీకెండ్ కు వన్ మిలియన్ వసూళ్లకు చేరుకుంది. సినిమా మొదటి రోజున మంచి కలెక్షన్లే వచ్చాయి. కానీ ఆ ఊపు ఒక్క రోజుకే పరిమితమైపోయింది. సినిమా రిలీజ్ రోజున హాఫ్ మిలియన్ డాలర్లు వస్తే.. ఇంకో హాఫ్ మిలియన్ రావడానికి ఆరు రోజులు పట్టింది. ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్ రూ. 9 కోట్ల వరకు పలికిందని టాక్. ఈ లెక్కన మిలియన్ డాలర్లు వసూలు చేసినా ఇంకా పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి లేదు. కలెక్షన్లు ఇంక పుంజుకునే అవకాశం లేదు. దీంతో ఓవర్సీస్ లో డిస్ట్రిబ్యూటర్ కు భారీ లాస్ తప్పదు. అల్లు అర్జున్ సినిమాల్లో వన్ మిలియన్ మార్క్ చేరుకున్న సినిమాల్లో డీజే మూడోది. ఇంతకు ముందు రేసుగుర్రం, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలు ఈ మార్క్ చేరుకున్నాయి.
దువ్వాడ జగన్నాథమ్ సినిమా అంతా రొటీన్ స్టోరీతో సాగడం ఓవర్సీస్ ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించలేకపోతోంది. అల్లు అర్జున్ ఇంతకుముందు చేసిన సరైనోడు మన దగ్గర మంచి కలెక్షన్లు రాబట్టగా ఓవర్సీస్ లో మాత్రం డిజాస్టర్ గా పేరు తెచ్చుకుంది. రొటీన్ కంటెంట్ తో సినిమా తీస్తే ఇక్కడ వర్కవుట్ అయినా అక్కడ వర్కవుట్ అవడం లేదు. సో అక్కడా.. ఇక్కడా ఒకేసారి మెప్పించాలంటే బన్నీ పద్ధతి మార్చాల్సిందే.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/