డీజే- దువ్వాడ జగన్నాధం అంటూ అల్లు అర్జున్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ గురించి అప్ డేట్స్ పెద్దగా బైటకు రావడం లేదు కానీ.. ఈ మూవీ షూట్ చాలా వేగంగా జరిగిపోతోందని టాక్. స్టైలిష్ స్టార్ కి బాగా అచ్చొచ్చిన సమ్మర్ కే రిలీజ్ చేసేలా టార్గెట్ పెట్టుకుని.. దర్శకుడు హరీష్ శంకర్ శరవేగంగా పనులు పూర్తి చేసేస్తున్నాడని అంటున్నారు.
డీజే మూవీకి ఇంకా ఫస్ట్ లుక్ కూడా ఇవ్వలేదు కానీ.. ఇప్పటికే టీజర్ ను కూడా కట్ చేసేశారని తెలుస్తోంది. రీసెంట్ గా హరీష్ శంకర్ ఈ టీజర్ ను బన్నీకి చూపించాడట కూడా. అయితే.. టీజర్ కట్ చేసిన విధానం బాగుందని అన్నా.. అల్లు అర్జున్ మాత్రం పూర్తి స్థాయిలో సంతృప్తి చెందలేదట. పైగా ఈ మూవీలో పక్కా బ్రాహ్మిన్ అయిన అదుర్స్ చారి టైపు రోల్ విషయంలో బన్నీ చాలా పట్టుదలగా ఉన్నాడని అంటున్నారు. అందుకనే.. హరీష్ శంకర్ చూపించిన టీజర్ కు మరిన్ని మార్పు చేర్పులు సూచించాడట స్టైలిష్ స్టార్.
సరైనోడు బ్లాక్ బస్టర్ తర్వాత అల్లు అర్జున్ బాగా జాగ్రత్తగా ఉంటున్నాడు. అందుకే ప్రస్తుతం బన్నీ చెప్పిన మార్పులకు అనుగుణంగా డీజే-దువ్వాడ జగన్నాధం టీజర్ రెడీ అవుతోందని తెలుస్తోంది. మహాశివరాత్రి సందర్భంగా ఈ టీజర్ ను ఫ్యాన్స్ ముందుకు తేవాలన్నది హరీష్ శంకర్ ఐడియా. గతంలో పవన్ తో తీసిన గబ్బర్ సింగ్ విషయంలో ఈ సెంటిమెంట్ వర్కవుట్ అయింది. అందుకే మళ్లీ అదే రోజుకు డీజే టీజర్ ను తెచ్చేందుకు యత్నస్తున్నాడు హరీష్ శంకర్.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/