అల్లు అర్జున్ హీరోగా డీజే -దువ్వాడ జగన్నాధం అంటూ ఓ హై బడ్జెట్ మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ.. సమ్మర్ కోసం శరవేగంగా సిద్ధమైపోతోంది. అయితే.. ఈ మూవీలో బన్నీ చేస్తున్న పాత్రపై చాలా రకాల కామెంట్స్ ఉన్నాయి.
వివి వినాయక్ దర్శకత్వంలో అదుర్స్ చిత్రంలో.. బ్రాహ్మణుడి పాత్ర చారిగా జూనియర్ ఎన్టీఆర్ అలరించిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ పాత్రను.. ఈ ట్రాక్ ను సృష్టించింది ఎవరో కాదు.. అప్పట్లో వినాయక్ కు అసిస్టెంట్ గా పని చేసిన హరీష్ శంకర్. ఇప్పుడు అదే చారి ఛాయలు ఉన్న పాత్రను లీడ్ రోల్ గా చేసి.. డీజే చిత్రాన్ని తీస్తున్నారనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. అదుర్స్ చిత్రానికి సీక్వెల్ కాకపోయినా.. చారి పాత్ర మాత్రం అదే రకంగా ఉంటుందట.
ఎప్పటి నుంచో అదుర్స్2 తీద్దామని ఎన్టీఆర్ అనుకుంటున్నా ఆ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు కానీ.. బన్నీ మాత్రం సైలెంట్ గా అదుర్స్ కి సీక్వెల్ లాంటి సినిమాని తెరకెక్కించేస్తున్నాడని అంటున్నారు. కథ సంగతి ఎలా ఉన్నా.. డీజేలో అల్లు అర్జున్ చేస్తున్న పాత్ర మాత్రం ఎన్టీఆర్ చేసిన చారి టైపులోనే ఉంటుందట.!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/