ఇప్పుడు చాలా సినిమాల విషయంలో.. ఇటు కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు అటు ఓవర్సీస్ లో కూడా బాగా ఆడాలనే ఆశ ఉంటుంది. కాని ఇక్కడ క్లిక్ అయితే అక్కడ క్లిక్ అవ్వదు.. అక్కడ అయితే ఇక్కడ అవ్వట్లేదు. కొన్ని సినిమాలు మాత్రం.. రెండు చోటలా ఆడుతున్నాయి. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే.. మాస్ సినిమాలు తెలుగు రాష్ట్రాల్లో ఆడితే.. క్లాస్ సినిమాలో అమెరికాలో ఆడుతున్నాయి. ఇక ఫ్యామిలీ డ్రామాలు అయితే.. రెండు చోట్లా ఆడేస్తున్నాయి.
ఇక మనం అల్లు అర్జున్ విషయానికొస్తే.. జులాయ్.. రేసుగుర్రం.. సన్నాఫ్ సత్యమూర్తి వంటి సినిమాలు ఓవర్సీస్ లో కూడా బాగానే ఆడాయి. ఆ సినిమాలోని క్లాస్ కంటెంట్ అనండి లేదంటే ఇంటెలిజెంట్ సీన్లు అనండి.. అవన్నీ బాగా కలిసొచ్చాయి. కాని సరైనోడు సినిమాతో మాస్ ప్రేక్షకులకు రెడ్ కార్పెట్ వేశాడు అల్లు అర్జున్. ఆ దెబ్బతో ఓవర్సీస్ సాయం లేకుండా ఇక్కడే 70 కోట్ల షేర్ రాబట్టేశాడు కాని.. అక్కడ మాత్రం ఫ్లాపును కొట్టాడు. ఇప్పుడు దువ్వాడ జగన్నాథమ్ సినిమాతో కూడా ఓవర్సీస్ లో మరోసారి ఖంగుతిన్నాడు. ప్రస్తుతానికి 1 మిలియన్ డాలర్ల వసూలుకు చేరువలో ఉన్న ఈ సినిమా.. 2 మిలియన్ తేకపోతే మాత్రం ఫ్లాపే. వరుసగా అమెరికాలో రెండో ఫ్లాపంటే మరి బన్నీ జాగ్రత్తపడాల్సిందే.
కేవలం మాస్ ను దృష్టిలో పెట్టుకుని సినిమాలు తీస్తే.. అక్కడ పోతాయ్. అలాగని క్లాస్ సినిమా తీస్తే ఇక్కడ పోతుంది. అందుకే బ్యాలెన్సడ్ గా ఉండేలా సినిమా కథలను ఎంచుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే మాత్రం బన్నీ ఓవర్సీస్ మార్కెట్ కు పర్మినెంట్ గా చొట్టలు పడిపోతాయ్!!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/