తెలుగు స్టార్ హీరోలకు ఉన్న అభిమానులను చూస్తుంటే ఒక్కోసారి ఆశ్చర్యం వేస్తుంది. మరీ ఇంత అభిమానం ఉన్న అభిమానులను సొంతం చేసుకున్నందుకు మన స్టార్ హీరోలు ఎంత అదృష్టవంతులు అనిపిస్తుంది. ఉత్తరాది స్టార్ హీరోలతో పోల్చితే సౌత్ హీరోలకు ఎక్కువగా అభిమానగణం ఉంటుంది. సౌత్ లో తెలుగు హీరోలకు ఎక్కువగా అభిమానులు ఉంటారు. అభిమానంతో కొన్ని సార్లు అభిమానులు చేసే పనులు వింతగా కూడా అనిపిస్తు ఉంటాయి. తాజాగా అల్లు అర్జున్ ను కలిసేందుకు గుంటూరు జిల్లా మాచర్ల నుండి హైదరాబాద్ కు కంభంపాడు నాగేశ్వరరావు పాదయాత్ర చేశాడు.
సెప్టెంబర్ 17వ తారీకున మాచర్లలో పాదయాత్ర మొదలు పెట్టిన నాగేశ్వరరావు హైదరాబాద్ చేరుకునేందుకు ఆరు రోజుల సమయం తీసుకున్నాడు. గతంలో నాలుగు అయిదు సార్లు హైదరాబాద్ వచ్చి బన్నీని కలిసేందుకు ఈయన ప్రయత్నించాడట. కాని ఆ సమయంలో బన్నీ ని కలవడం వీలు పడలేదు. ఈసారి బన్నీని కలిసి ఒక ఫొటో తీసుకుని రెండు నిమిషాలు మాట్లాడిన తర్వాతే మాచర్ల వెళ్తాను అంటూ భీష్మించుకు కూర్చున్నాడు. మీడియాలో ఇతడి గురించి ప్రముఖంగా కథనాలు వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే అతడి గురించి బన్నీకి తెలిసి ఉంటుంది.
ఇలాంటి అభిమానులను వెంటనే బన్నీ కలిసేందుకు ఆసక్తి చూపిస్తారు. కాని కరోనా సమయం అది కూడా అంత దూరం నుండి నడిచి రావడం వల్ల అతడి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో అనే అనుమానాలు ఎవరికైనా ఉంటాయి. మరి బన్నీ నాగేశ్వరరావు విషయంలో ఎలా స్పందిస్తాడు అనేది చూడాలి. గంగోత్రి సినిమా సమయం నుండి బన్నీని అభిమానిస్తున్నట్లుగా నాగేశ్వరరావు చెబుతున్నాడు.