సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ సోదరుడు, యువ హీరో ఆనంద్ దేవరకొండ నటించిన కొత్త సినిమా "పుష్పక విమానం". 'మిడిల్ క్లాస్ మెలోడీస్' వంటి సూపర్ హిట్ తర్వాత ఆనంద్ నుంచి వస్తున్న ఈ సినిమాపై అందరిలో ఆసక్తి నెలకొంది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తున్న ఈ మూవీ రిలీజ్ కు రెడీ అయింది. పాండమిక్ వల్ల రిలీజ్ కోసం వేచి చూసిన ఈ చిత్రాన్ని నవంబర్ 12న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.
ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ ముమ్మరం చేస్తున్న మేకర్స్ గ్రాండ్ గా "పుష్పక విమానం" ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని ప్లాన్ చేస్తున్నారు. ఈ ఈవెంట్ కు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చీఫ్ గెస్టుగా హాజరు కానున్నారు. అక్టోబర్ 30న జరగనున్న ఈ కార్యక్రమానికి విజయ్ దేవరకొండ కూడా అటెండ్ అవుతారు. బన్నీ - విజయ్ ఒకే వేదికను పంచుకునే ఈ వేడుక కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
కాగా, "పుష్పక విమానం" సినిమాతో దామోదర అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. విజయ్ దేవరకొండ సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని 'కింగ్ అఫ్ ది హిల్' ప్రొడక్షన్ మరియు టాంగా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించాయి. గోవర్ధన్ రావు దేవరకొండ - విజయ్ దషి - ప్రదీప్ ఎర్రబెల్లి దీనికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మధ్యతరగతి కుటుంబాలలో పెళ్లి చుట్టూ జరిగే పరిస్థితులతో ఈ కామెడీ డ్రామాని రెడీ చేశారు.
ఇందులో ఆనంద్ ఒక గవర్నమెంట్ స్కూల్ టీచర్ గా కనిపించనున్నారు. గీత్ సైని - శాన్వి మేఘన ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. సునీల్ - నరేష్ - హర్షవర్థన్ - అజయ్ - సుదర్శన్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. రామ్ మిరియాల - సిద్దార్థ్ సదాశివుని - అమిత్ దాసాని ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. మార్క్ కె రాబిన్ నేపథ్య సంగీతం అందించారు. హెస్టిన్ జోస్ జోసెఫ్ సినిమాటోగ్రఫీ అందించగా.. నీల్ సెబాస్టియన్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు. రవితేజ గిరిజాల ఎడిటర్ బాధ్యతలు నిర్వహించారు.
"పుష్పక విమానం" చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు - 'కళ్యాణం కమనీయం' పాట విశేష స్పందన తెచ్చుకున్నాయి. దేవరకొండ బ్రదర్ నుంచి మరికొన్ని రోజుల్లో థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.