'అల వైకుంఠపురములో' సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న అల్లు అర్జున్.. ఇప్పుడు ''పుష్ప'' సినిమాతో పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో రెండు భాగాలుగా విడుదల చేస్తున్నారు. ఫస్ట్ పార్ట్ 'పుష్ప: ది రైజ్' హిందీ థియేట్రికల్ రిలీజ్ కు సంబంధించిన అన్ని సమస్యలు ఇప్పుడు క్లియర్ అయ్యాయి. దీంతో 'పుష్ప-1' అల్లు అర్జున్ కెరీర్ లో తొలి పాన్ ఇండియా చిత్రంగా డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతోంది.
'పుష్ప' మొదటి భాగంలో లారీ డ్రైవర్ పుష్పరాజ్ గా అల్లు అర్జున్ కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ లో ఊర మాస్ లుక్ లో దర్శనమిచ్చి అభిమానులను అలరించారు. ఇన్నాళ్లూ స్టైలింగ్ లో స్పెషల్ గా నిలిచిన బన్నీ.. ఈ సినిమాలో తన పాత్ర కోసం కంప్లీట్ గా డీ గ్లామర్ అవతార్ లోకి మారిపోయాడు. రా అండ్ రస్టిక్ గా లుక్ కోసం తీవ్రంగా కష్టపడ్డాడు. నిజ జీవితంలోని లారీ డ్రైవర్ లేదా ఒక రోజువారీ కూలీ లుక్ లో కనిపించడం కోసం.. అలాంటి పాత్ర కోసం బన్నీ కొంత బరువు కూడా పెరిగారని తెలుస్తోంది.
అల్లు అర్జున్ తన లుక్ ని సరిగ్గా పొందడానికి చాలా కష్టపడ్డాడు. దీని కోసం కొన్ని కిలోల పెరిగినప్పటికీ ఫిజిక్ విషయంలో మాత్రం ఏ మాత్రం అశ్రద్ధ చేయలేదు. అవుట్ డోర్ షూటింగ్ ఉన్నప్పుడు బన్నీ తనతో పాటు అతని చెఫ్ మరియు ట్రైనర్ ను కూడా తీసుకెళ్లారు. ఈవిధంగా ఫుడ్ మరియు వర్కవుట్స్ విషయాల్లో ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకున్నారు. సినిమా కోసం బాగా తీవ్రంగా శ్రమించిన బన్నీ కి 'పుష్ప' ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.
ఇకపోతే 'పుష్ప' చిత్రంలో స్టార్ హీరోయిన్ సమంత కూడా భాగమైంది. ఓ స్పెషల్ సాంగ్ లో సామ్ ఆడిపాడనుందని చిత్రబృందం సోమవారం అధికారికంగా ప్రకటించింది. సమంత కెరీర్ లో స్పెషల్ సాంగ్ లో ఆడిపాడటం ఇదే తొలిసారి. వచ్చే వారంలోనే ఆ ప్రత్యేక గీతాన్ని చిత్రీకరించనున్నారు. దీంతో 'పుష్ప: ది రైజ్' సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ అవుతుంది. ఈ క్రమంలో మేకర్స్ ప్రమోషన్స్ ముమ్మరం చేయనున్నారు.
‘పుష్ప’లో అల్లు అర్జున్ కు జోడీగా రష్మిక మందన్నా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఫాహాద్ ఫాజిల్ - సునీల్ - అనసూయ - ధనుంజయ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ముత్తం శెట్టి మీడియాతో కలిసి మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని - వై రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే విడుదలైన మూడు పాటలు మంచి రెస్పాన్స్ తెచ్చుకోగా.. 'హే బిడ్డా ఇది నా అడ్డా' అనే మరో పాటను రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.