అల్లు అర్జున్ హీరోగా దిల్ రాజు నిర్మాణంలో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో 'ఐకాన్' అనే సినిమాను దాదాపు రెండేళ్ల క్రితం ప్రకటించిన విషయం తెల్సిందే. త్రివిక్రమ్ మూవీ తర్వాత ఐకాన్ చేయాల్సిన బన్నీ కొన్ని కారణాల వల్ల సుకుమార్ తో పుష్పకు రెడీ అయ్యాడు. పుష్ప తర్వాత అయినా ఐకాన్ కు వెళ్తాడేమో అనుకుంటే కొరటాల శివ దర్శకత్వంలో మూవీని ప్రకటించాడు. ఈ కారణాల వల్ల ఐకాన్ సినిమా ఆగిపోయినట్లేనా అంటూ అనుమానాలు వ్యక్తం అయ్యాయి. తాజాగా దర్శకుడు వేణు శ్రీరామ్ మాట్లాడుతూ ఐకాన్ పై క్లారిటీ ఇచ్చాడు.
ఐకాన్ స్టోరీ చెప్పిన సమయంలో బన్నీ తప్పకుండా చేద్దాం అన్నాడు. ఇదో విభిన్నమైన సినిమా బన్నీకి విభిన్నమైన క్రేజ్ ను తెచ్చి పెడుతుంది. సినిమా ఆలస్యం అవుతుంది తప్ప ఆగిపోలేదు అంటూ వేణు శ్రీరామ్ అన్నాడు. బన్నీకి ఐకాన్ పై ప్రత్యేకమైన శ్రద్ద ఉన్నట్లుగా తెలుస్తోంది. ఐకాన్ సినిమాను ప్రత్యేకంగా చేయాలనే ఉద్దేశ్యంతోనే కాస్త సమయం తీసుకుంటున్నాడట.
బన్నీ సినిమాల ఆర్డర్ లోమార్పులు వచ్చాయి తప్ప ఐకాన్ సినిమాను మాత్రం పూర్తిగా వదిలేయలేదు అంటూ దర్శకుడి మాటలతో క్లారిటీ వచ్చేసింది. దర్శకుడు వేణు శ్రీరామ్ ప్రస్తుతం 'వకీల్ సాబ్' సినిమాను చేస్తున్నాడు. ఆ తర్వాత బన్నీతో చేయబోతున్న ఐకాన్ సినిమా పై మళ్లీ వర్క్ మొదలు పెట్టబోతున్నాడు. అన్ని అనుకున్నట్లుగా జరిగితే 2022 ఆరంభంలోనే ఐకాన్ మొదలయ్యే అవకాశం ఉందంటున్నారు.