స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో `ఐకాన్` చిత్రం ఈపాటికే సెట్స్ కెళ్లాల్సిన సంగతి తెలిసిందే. అధికారికంగా ప్రకటనా ఇచ్చినా ఇప్పటివరకూ సెట్స్ కు వెళ్లలేదు. వాస్తవానికి `పుష్ప` కంటే ముందే ఐకాన్ ప్రారంభం కావాలి. కానీ సుకుమార్ పుష్ప కథతో ఎంటర్ అవ్వడంతో బన్నీ `ఐకాన్` ని తాత్కాలికంగా పక్కనబెట్టేసాడు. `పుష్ప` పాన్ ఇండియా చిత్రం కావడంతో ఐకాన్ ని తాత్కాలికంగా హైడ్ చేశారు. ఇటీవలే `పుష్ప ది రైజింగ్` కూడా పూర్తవ్వడంతో మళ్లీ ఐకాన్ తెరపైకి వచ్చింది. వచ్చే ఏడాది ఆరంభంలో ఐకాన్ ప్రారంభం అవుతుందని మీడియా కథనాలు వైరల్ అయ్యాయి.
ఇప్పటికే కమిట్ అయిన ప్రాజెక్ట్ కాబట్టి ఆ చిత్రం పక్కాగా లాంచ్ అవ్వడం ఖాయంగా కనిపించింది. అయితే మళ్లీ `ఐకాన్` కి అడ్డంకులు ఏర్పడినట్లు ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది. ఇటీవల మళ్లీ బోయపాటి శ్రీను పేరు తరుచూ వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. బన్నీహీరోగా బోయపాటి దర్శకత్వంలో అల్లు అరవింద్ నిర్మాతగా మరో చిత్రం ప్రారంభమవుతుందని మీడియా కథనాలు వేడెక్కిస్తున్నాయి. అరవింద్ కూడా నేరుగా ఓ వేదికపైనే బోయపాటి తో సినిమా చేస్తున్నట్లు ప్రకటించడం ఈ ప్రచారానికి ఊతంగా మారింది. అలాగే బన్నీ బోయపాటి వినిపించిన స్క్రిప్ట్ ని లాక్ చేసినట్లు ప్రచారం సాగుతోంది. `పుష్ప` నుంచి బన్నీ ప్రీ అవ్వగానే ఈకాంబినేషన్ లో చిత్రం ప్రారంభం కావడం ఖాయమని వినిపిస్తోంది.
మరి అదే గనుక నిజమైతే మళ్లీ వేణు శ్రీరామ్ కి నిరాశ తప్పదు. మరి బన్నీ ఐకాన్ ని ఇంతగా అశ్రద్ధ ఎందుకు చేస్తున్నట్లు? అన్న ప్రశ్న మీడియాలో రెయిజ్ అవుతోంది. సుకుమార్ ఎంట్రీతో అప్పుడు అలా జరిగితే.. ఇప్పుడు బోయపాటి ప్రవేశంతో మళ్లీ ఐకాన్ వెనక్కి వెళ్లిపోతుందా? అని ఫ్యాన్స్ సైతం ఆలోచనలో పడ్డారు. మరి ఈ సందిగ్ధతకు..ఈ ప్రచారాలకు తెర దించాలంటే అసలు విషయాన్ని బన్నీ మీడియా ముందు ఉంచాల్సిందే. ప్రస్తుతం బన్నీ పుష్ప షూటింగ్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఐకాన్ పూర్తి చేసి పుష్ప డ్యూయాలజీలో పార్ట్ 2 ని కూడా బన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. వకీల్ సాబ్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తీశాక కూడా వేణు శ్రీరామ్ కి ఎందుకనో కెరీర్ పరమైన డైలమా తప్పడం లేదని గుసగుస వినిపిస్తోంది.