సినిమాగా ఏ కథ వర్కవుటవుతుందో.. ఏది తేడా కొడుతుందో చెప్పడం అంత సులువు కాదు. ఒక హీరోకు నచ్చని కథ ఇంకో హీరో దగ్గరికి వెళ్లి పట్టాలెక్కడం తరచుగానే జరుగుతుంటుంది. ఆ సినిమా ఫలితాన్ని బట్టి దాన్ని వదులుకున్న హీరో నిర్ణయం సరైందా.. కాదా అన్న చర్చ నడుస్తుంటుంది. టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గతంలో ఇలా కొన్ని కథల్ని వదులుకుంటే అందులో కొన్ని విజయవంతమయ్యాయి. కొన్ని తేడా కొట్టాయి. టాలీవుడ్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ‘గీత గోవిందం’ కథ సైతం బన్నీకే ముందు చెప్పినట్లు వార్తలొచ్చాయి. మరోవైపు తమిళంలో త్వరలోనే విడుదల కానున్న ‘జీనియస్’ సినిమా కూడా బన్నీ చేయాల్సినదే అంటోంది కోలీవుడ్ మీడియా.
‘నా పేరు శివ’.. ‘పల్నాడు’.. ‘జయసూర్య’.. ‘కేరాఫ్ సూర్య’ లాంటి సినిమాలు తీసిన తమిళ దర్శకుడు సుశీంద్రన్ గత ఏడాది బన్నీకి ఒక కథ చెప్పాడట. ఐతే తన ఇమేజ్ కు అది సెట్టవదని భావించి నో చెప్పాడట. దీంతో సుశీంద్రన్ తన మాతృభాషలోనే ఈ సినిమా చేశాడు. ఐతే అతను ఈ చిత్రానికి ఒక కొత్త హీరోను ఎంచుకోవడం విశేషం. మరి బన్నీ లాంటి స్టార్ కోసం తయారు చేసిన కథకు కొత్త హీరోను ఎంచుకోవడమేంటో అర్థం కావడం లేదు. ఈ సినిమా ఫస్ట్ పోస్టర్ చూసినా ఇది క్లాస్ టచ్ ఉన్న కాన్సెప్ట్ మూవీలా కనిపిస్తోంది. మరి ఈ కథను బన్నీకి చెప్పి ఎలా ఒప్పించాలనుకున్నాడో సుశీంద్రన్? ఇంతకీ ‘జీనియస్’ తమిళంలో ఎలాంటి ఫలితాన్నందుకుంటుందో చూడాలి. వచ్చే నెలలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.