సినిమా సినిమాకు తన రేంజి పెంచుకుంటూ వరుస హిట్లతో దూసుకెళ్లిపోతున్నాడు అల్లు అర్జున్. ‘సరైనోడు’ లాంటి డివైడ్ టాక్ వచ్చిన సినిమాతో సైతం రూ.60 కోట్ల షేర్ కలెక్ట్ చేయడం అతడి స్థాయిని తెలియజేస్తుంది. ఇలాంటి టైంలో బన్నీకి సరైన ఇంకో డైరెక్టర్ దొరికితే అతడి రేంజి మరింత పెరగడం ఖాయం. ఐతే బన్నీ మాత్రం ఓ ఫ్లాప్ డైరెక్టర్ తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఆ దర్శకుడు మరెవరో కాదు.. లింగుస్వామి.
లింగుస్వామి ఒకప్పుడు రన్.. పందెం కోడి లాంటి సూపర్ హిట్లు ఇచ్చిన మాట వాస్తవం. కానీ ఈ మధ్య అతడి ఫామ్ ఏమంత బాగా లేదు. గత పదేళ్లలో అతను కొట్టిన ఏకైక హిట్టు వేట్టై (తెలుగులో తడాఖా). చివరగా సూర్యతో అంజాన్ (సికిందర్) లాంటి డిజాస్టర్ తీశాడు. దర్శకత్వం మీద ఎక్కువ దృష్టిపెట్టకుండా నిర్మాతగా ఎక్కువ సినిమాలు చేసుకుంటూ సాగిపోతున్న లింగుస్వామి.. ఈ మధ్య ‘పందెంకోడి’కి సీక్వెల్ తీయాలనుకుని వెనక్కి తగ్గాడు. బన్నీ అతడి కథకు ఓకే చెప్పడమే దీనికి కారణం.
తన తర్వాతి సినిమా తెలుగు-తమిళ భాషల్లో తెరకెక్కుతుందని ఇప్పటికే బన్నీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా లింగుస్వామితో చేయబోయేదే. విక్రమ్ కుమార్ తో చేస్తాడనుకున్న బన్నీ.. లింగుస్వామికి ఓటేయడం రిస్కే. ఐతే తమిళంలో కూడా మార్కెట్ పెంచుకోవాలని చూస్తున్న బన్నీ.. లింగుస్వామితో అయితేనే అది సాధ్యమని ఫిక్సయినట్లున్నాడు. ఈ సినిమాను అల్లు అరవింద్ తో కలిసి సూర్య కజిన్ జ్నానవేల్ రాజా నిర్మించబోతున్నాడు. జూన్ 1న సినిమా ప్రారంభోత్సవం జరుపుకుంటుంది.