అల్లు అర్జున్ ప్రస్తుతం చేస్తున్న సినిమా నా పేరు సూర్య... నా ఇల్లు ఇండియా. ఇందులో తొలిసారి బన్నీ సైనికుడి పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమా ప్రమోషన్ మొన్నటి వరకు బాగానే సాగింది. కానీ ఇప్పుడెందుకు సినిమా గురించి ఎవరూ పెద్దగా మాట్లాడుతున్నట్టు కనిపించడం లేదు. సినిమా విడుదల తేదీల విషయంలో నెలకొన్న వివాదం ముగిసిపోవడంతో బన్నీ కాస్త ఊపిరి పీల్చుకున్నట్టే కనిపిస్తున్నా... ప్రమోషన్ విషయంలో మాత్రం ఇబ్బంది పడుతున్నట్టే కనిపిస్తున్నాడు.
నా పేరు సూర్య ప్రమోషన్స్ జనవరి నుంచే మొదలుపెట్టారు. మొదటిగా ఫస్ట్ ఇంపాక్ట్ పేరుతో బన్నీ క్యారెక్టర్‌ను పరిచయం చేశారు. సైనికుడిగా కనిపించిన బన్నీని చూసి అభిమానులు ఆనందంలో ఊగిపోయారు. తరువాత గణతంత్ర్య దినోత్సవం సందర్భంగా ‘సైనిక్’ సాంగ్ ను విడుదల చేశారు. అది కూడా బాగానే ప్రేక్షకులను కనెక్ట్ అయింది. ప్రేమికుల రోజున... లవర్ ఆల్సో పాటను విడుదల చేసి సినిమాలో కేవలం దేశభక్తే కాదు... ప్రేమను గురించి కూడా చెప్పినట్టు హింట్ ఇచ్చారు. ఇప్పుడు పోస్టర్ ఇంపాక్ట్ పేరుతో మరోటి విడుదల చేయడానికి సిద్దంగా ఉన్నారు. మార్చి 1న ఈ ఇంపాక్ట్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
సినిమా విడుదలకు ఇంకా దాదాపు రెండు నెలల సమయం ఉంది. అంతవరకు ప్రజల్లో ప్రస్తుతం ఉన్న బజ్ పోకుండా ఉండాలి. అందుకోసమే రోజుల తేడాతో ఏదో ఒకటి విడుదల చేస్తూనే ఉండాలని భావిస్తోంది బన్నీ అండ్ కో. లేకుంటే భరత్ అను నేను సినిమా కూడా విడుదలకు సిద్ధమవుతుండడంతో అటువైపు ప్రేక్షకులు ఆకర్షితులు అవ్వకుండా చూడడం బన్నీ బ్యాచ్ కు కాస్త కష్టసాధ్యమైనే పని. అందుకే పద్దతి ప్రకారం... ఏదో ఒకటి విడుదల చేసుకుంటూ కాలం గడపాలని భావిస్తున్నట్టున్నారు. ఈ సినిమాలో బన్నీకి జంటగా అను ఇమ్మాన్యుయేల్ నటిస్తోంది.