సూర్య రూటే వేరయా!!

Update: 2018-03-21 04:41 GMT
పక్క భాషల హీరోలంతా మన దగ్గర పాగా వేసేందుకు చాలాకాలం నుంచి గట్టిగానే ట్రై చేస్తున్నారు. పలువురు సక్సెస్ అయ్యారు కూడా. కానీ మన హీరోలు ఇతర భాషల్లో సక్సెస్ అవడం.. మార్కెట్ పెంచుకోవడం అనే ట్రెండ్ కి మాత్రం ఆద్యుడు అల్లు అర్జున్. ఇప్పటికే మలయాళ ఇండస్ట్రీలో బోలెడంత మార్కెట్ తెచ్చుకున్న బన్నీకి.. హిందీ శాటిలైట్ పై కూడా సూపర్ గ్రిప్ ఉంది.

ఇప్పుడు తమిళ ఫిలిం ఇండస్ట్రీలో కూడా తన ప్రయత్నాలను స్టార్ట్ చేసేశాడు అల్లు అర్జున్. సహజంగా మన సినిమాలు రిలీజ్ తర్వాత కొంతకాలానికి తమిళంలో డబ్ అయి రిలీజ్ అవుతుంటాయి. కానీ డైరెక్ట్ గా ఒకే రోజు విడుదల చేస్తేనే ఆ ఇంపాక్ట్ కనిపిస్తుందనే ఉద్దేశ్యంతో ఇప్పుడు తమిళ్ లో 'ఎన్ పేరు  సూర్య' అంటూ నా పేరు సూర్యను డబ్బింగ్ చేస్తున్నారు. బన్నీ సినిమాలు మలయాళంలో ఎలాగూ అదే రోజన విడుదల అవుతాయి. ఇప్పుడు తమిళ్ లో కూడా ఈ చిత్రాన్ని తెచ్చేస్తున్నాడు బన్నీ.

దేశభక్తి కంటెంట్ కావడంతో అన్ని వర్గాల ఆడియన్స్ ను ఇది మెప్పించే సినిమా అవుతుందని భావించాడట అల్లు అర్జున్. నిజానికి బన్నీకి తెలుగు-తమిళ్ లో ఓ ద్విభాషా చిత్రం చేసే యోచన ఉంది. అప్పట్లో ఓ ప్రాజెక్టు లాంఛ్ అయింది కానీ.. షూటింగ్ స్టార్ట్ కాలేదు. ఇప్పుడు డబ్బింగ్ ముూవీతో కోలీవుడ్ లో స్ట్రెయిట్ ఎంట్రీ ఇస్తున్న అల్లు అర్జున్.. త్వరలోనే బైలింగ్యువల్ తో తమిళ ఆడియన్స్ ను థ్రిల్ చేయాలని భావిస్తున్నాడట.
Tags:    

Similar News