నా పేరు సూర్య.. పనైపోయింది!!

Update: 2018-03-19 11:15 GMT
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ లో ఎప్పుడు లేనంతగా నా పేరు సూర్య సినిమాతో హైప్ క్రియేట్ చేసుకున్నాడు. ఆ సినిమా రిలీజ్ సమయం కోసం ఓ వర్గం ప్రేక్షకులు చాలానే ఎదురుచూస్తున్నారు. రచయిత వక్కంతంగా వంశీ మొదటి సారి తెరకెక్కిస్తోన్న సినిమా కావున సినిమా ఇండస్ట్రీలో కూడా అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఇకపోతే గత కొంత కాలంగా షూటింగ్ లో చిత్ర యూనిట్ బిజీగా ఉన్న సంగతికి తెలిసిందే.

ఎలాంటి హాలిడేస్ తీసుకోకుండా దర్శకుడు అతని టీమ్ చాలా కష్టపడి వర్క్ చేశారు. అయితే ఫైనల్ గా చిత్ర యూనిట్ సమాచారం ప్రకారం సినిమా షూటింగ్ ఎండ్ అయినట్లు తెలుస్తోంది. అసలైతే కొన్ని వారాల ముందే ఫినిష్ అవ్వగా కొన్ని ప్యాచప్ పనులను దర్శకుడు పూర్తిచేసినట్లుసమాచారం. మొత్తానికి నా పేరు సూర్య అవుట్ డోర్ వర్క్ మొత్తం అయిపొయింది. కేవలం సినిమా యొక్క ప్రీ ప్రొడక్షన్ పనులు మాత్రమే మిగిలి ఉన్నాయి.

త్వరలో వాటిని కూడా ఫినిష్ చేసి వారం ముందే ముందే సినిమా రిలీజ్ డేట్ కు సర్వం సిద్ధం చేయాలనీ అనుకుంటున్నారట. ఇక మధుర శ్రీధర్ - నాగేంద్ర బాబు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటించింది. సమ్మర్ కానుగా సినిమాను వచ్చే నెల ఏప్రిల్ లో రిలీజ్ చేయనున్నారు.             


Tags:    

Similar News