ఈ మధ్యన వైజాగ్ లో సరైనోడు ఆడియో ఫంక్షన్ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిధిగా హాజరైన మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ..తన డాడీ సినిమాలో అల్లు అర్జున్ కోసం ప్రత్యేకంగా ఒక క్యారెక్టర్ సృష్టించి పాత్రను ఇచ్చినట్లు గొప్పలు చెప్పుకున్నారు. ఎంతైనా మేనల్లుడు కాబట్టి.. ఆ మాత్రం చేయటం తప్పేముందని అనుకున్నారంతా. కానీ.. తాజాగా ఒక మీడియా సంస్థ అల్లు అర్జున్ చేసిన ఇంటర్వ్యూలో చిరు మాటకు భిన్నంగా బన్నీ వ్యాఖ్యలు ఉండటం గమనార్హం.
మేనల్లుడు కోసం తాను చాలా గొప్ప పని చేసినట్లుగా సరైనోడు ఆడియో ఫంక్షన్లో చిరు చెబితే.. డాడీ సినిమాలో పాత్ర గురించి బన్నీ చెప్పిన మాటలు చూస్తే.. ఇద్దరి మధ్య మాటల్లో తేడా ఇట్టే అర్థం కాక మానదు. తాను యానిమేషన్ అప్రెంటీస్ గా పని చేస్తున్న సమయంలో ఒక రోజు చిరంజీవి నుంచి కాల్ వచ్చిందని.. డాడీ షూటింగ్ కు రమ్మన్నారన్నారు.
అలా డాడీ షూటింగ్ స్పాట్ కి వెళితే.. డ్యాన్స్ నేర్చుకునే ఓ పదిహేడేళ్ల కుర్రాడితో ఒకట్రెండు సీన్లు అవసరమయ్యాయి. ఆ పాత్రను నాతో చేయించారు. ఆయన చెప్పినట్లే రెండు సీన్లు చేసేసి.. నా దారిన నేను వెళ్లిపోయా. నిజానికి ఆ సినిమా గురించి మర్చిపోయా అంటూ చెప్పుకొచ్చాడు. అల్లు అర్జున్ కోసమే తాను ఒక పాత్ర సృష్టించినట్లుగా చిరంజీవి చెబితే.. అలా పిలిస్తే.. ఇలా వెళ్లి పని పూర్తి చేసుకొని నా పనిలో నేను మునిగిపోయా అని చెప్పటం ద్వారా బన్నీ డాడీ సినిమాలో అవకాశం గురించి చెప్పకనే చాలానే చెప్పేశాడనిపించక మానదు. చూస్తుంటే.. చిరు కాస్త గొప్పలు చెప్పుకుంటున్నట్లు అనిపించట్లేదు..?