150కి 150 కావాలంటున్న బన్నీ సార్‌

Update: 2016-05-05 04:15 GMT
ఎవరి అంచనాలు వారివి. మనం కాదనలేం. అయితే స్టయిలిష్‌ స్టార్‌ బన్నీ సార్‌ అంచనాలు మాత్రం ఓ రేంజులో ఉన్నాయి. అది కూడా తను మనకు మాత్రమే ఓపెన్‌ గా చెప్పట్లేదు.. ఏకంగా మెగాస్టార్‌ చెయ్యి పట్టుకొని ఆయనకే చెప్పాడట. పదండి అసలు విషయం ఏంటో చూద్దాం.

మొన్ననే చిరంజీవి 150వ సినిమా అధికారికంగా కుటుంబ సభ్యుల మధ్యన లాంచ్‌ అయ్యింది. ఈ కార్యక్రమానికి యావత్‌ మెగా ఫ్యామిలీ హాజరైంది. అఫ్‌ కోర్స్‌ పవర్‌ స్టార్‌ ఒక్కరే గైర్హాజరయ్యారులే. ఈ సందర్భంగా చిరంజీవికి షేక్ హ్యాండ్‌ ఇచ్చి ఆల్‌ ది బెస్ట్‌ చెప్పిన బన్నీ.. ఒక విషయం చెప్పాడట.. ''మళ్లీ లైన్లోకి వచ్చారు కాబట్టి.. 150వ సినిమాతో మాకు 150 కోట్లు షేర్‌ కావల్సిందే. మీరు కొట్టాలి.. కొడుతున్నారు అంతే.. అని చిరంజీవి గారికి చెప్పాను. మరి దానికి మనందరం (ఆడియన్స్‌) హెల్ప్‌ చేయాలి'' అంటూ సెలవిచ్చాడు బన్నీ. బాగానే ఉంది.

కాని 150వ సినిమాను ఖచ్చితంగా బాహుబలి రేంజులో హైపు సృష్టించి.. శ్రీమంతుడు రేంజులో భారీగా ప్రమోట్‌ చేసి.. కంటెంట్‌ తో ఇంప్రెస్‌ చేసి.. సరైన టైములో సరైన సోలో రిలీజ్‌ చేస్తేనే.. 150 కోట్లు షేర్‌ అనేది పాజిబుల్‌ అవుతుంది. లేకపోతే 150 గ్రాస్‌ తో సరిపెట్టుకోవాల్సి వస్తుంది. ముందు ప్రొడ్యూసర్‌ రామ్‌ చరణ్‌ కు ఆ ప్లానింగ్‌ గురించి చెప్పండి బన్నీ సార్‌!!
Tags:    

Similar News