పవర్ స్టార్.. పవర్ స్టార్ అంటూ ‘‘కొందరు’’ ఫ్యాన్స్ అరవటం వల్ల ఎంత పెద్ద రచ్చ అవుతుందో తాజాగా ‘‘ఒక మనసు’’ ఆడియో ఫంక్షన్లో బన్నీ తన మాటలతో చెప్పేశారు. మన హీరోల ఫంక్షన్లో అలా అరుస్తున్నారు సరే. కానీ.. వేరే వాళ్ల ఫంక్షన్లోను అలానే అరుస్తున్నారు. అలా అరిచి చాలా ఇబ్బంది పెడుతున్నారంటూ చెప్పిన బన్నీ.. ఇలాంటి అరుపులతో తాను హర్ట్ అయ్యానని.. తమ ఫ్యామిలీ హర్ట్ అయ్యిందన్న విషయాన్నిచెప్పటమే కాదు.. తనకు బాగా తెలిసిన వ్యక్తి అడిగిన మాట తనను బాధకు గురి చేసిందని వ్యాఖ్యానించారు.
‘‘మావాళ్ల ఫంక్షన్లో మీవాళ్ల గోలేంటి’’ అని అడిగారని.. అప్పుడు తనకు చాలా బాధ కలిగించిందని చెప్పిన అల్లు అర్జున్.. వేరే హీరోల వేడుకల్లో ఇలా చేయటం సరికాదని.. తానింత స్థాయికి రావటానికి చిరంజీవిగారే పవన్ కల్యాణేనే చాలాసార్లు చెప్పారని.. అలాంటి చిరంజీవి మాట్లాడుతున్నప్పుడు పవర్ స్టార్ అని అరిస్తే ఆయనకెంత ఇబ్బందిగా ఉంటుందో అని అల్లు అర్జున్ తన మనసులోని మాటను బయటపెట్టేశారు.అందుకే తాను పవన్ కల్యాన్ గురించి మాట్లాడకూడదని డిసైడ్ అయినట్లుగా చెప్పిన అల్లు అర్జున్.. చివర్లో ఒక పంచ్ ఇచ్చారు.
తన మాటల వల్ల ఫ్యాన్స్ బాధ పడి ఉండొచ్చన్న అల్లు అర్జున్.. ఫ్యాన్స్ వల్ల తమ ఫ్యామిలీ చాలాసార్లు హర్ట్ అయ్యిందని.. ఒక వివాదాన్ని తప్పించుకోవటానికి మీడియా ముందు మాట్లాడ లేదని..కానీ ఇప్పుడు అదే పెద్ద వివాదమైందన్న బన్నీ.. తనకు పవన్ అంటేచాలా ఇష్టమని.. తనను ఆయనెంతో ప్రోత్సహించారని.. ఇప్పుడా విషయాలు చెబితే బటర్ పూసినట్లు ఉంటుందని అందుకే తాను చెప్పటం లేదన్నారు. సోషల్ మీడియాలో గ్రూపులుగా విడిపోయి మాటల యుద్ధంగాలోకి దిగిన అభిమానుల గురించి ప్రస్తావిస్తూ.. మీరంతా సోషల్ మీడియాలో గ్రూపులు కావొచ్చు.. కానీ తామంతా ఓ ఫ్యామిలీ అని.. ఇకపై లాంటివేమీ చేయొద్దంటూ ముక్తాయించారు. అల్లుఅర్జున్ ఇంక క్లియర్ గా చెప్పాక ‘‘కొందరు’’ మెగా అభిమానులు ఇకపై ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి..?