బన్నీ వద్దన్నాక సందీప్ చేశాడా?

Update: 2016-06-09 10:16 GMT
‘కృష్ణాష్టమి’ సినిమాతో అల్లు అర్జున్ నటించలేదు. కానీ ఆ సినిమా విడుదలైన బన్నీ గురించి చాలా చర్చే జరిగింది. ఈ కథను ముందు బన్నీకే చెప్పామని వెల్లడించాడు దిల్ రాజు. మరి బన్నీ ఎందుకు ఈ కథను రిజెక్ట్ చేశాడో చూద్దామని ఆసక్తి చూపించారు జనాలు. తీరా సినిమా చూశాక బన్నీ సరైన నిర్ణయమే తీసుకున్నాడని అర్థమైంది.

ఐతే ఈ శుక్రవారం విడుదలవుతున్న ‘ఒక్క అమ్మాయి తప్ప’ కథ కూడా ముందు బన్నీ దగ్గరికే వెళ్లిందట. ఈ విషయాన్ని స్వయంగా ఆ చిత్ర బృందమే వెల్లడించింది. ఐతే బన్నీ ఈ కథను తిరస్కరించలేదని.. అతడి చాలా బాగా నచ్చిందని.. ఐతే ఆసక్తికర మలుపులున్న ఈ కథను అనుభవమున్న దర్శకుడితో చేయాలని భావించి.. స్టోరీ మాత్రం అడిగాడని.. ఐతే ఇది తన డ్రీమ్ ప్రాజెక్ట్ కావడంతో రాజసింహానే సొంతంగా దర్శకత్వం వహించాలని అందుకు ఒప్పుకోలేదని ఈ చిత్ర బృందం చెబుతోంది.

కాబట్టి ఇది బన్నీ రిజెక్ట్ చేసిన స్టోరీ అనుకోకూడదన్నమాట. ఇంతకుముందు బన్నీ ఓ స్టోరీని తనకు నప్పదని భావించి.. మరో హీరోతో చేయించాడు. అదే.. భద్ర. అది సూపర్ హిట్టయింది. మరి బన్నీని దాటుకుని వచ్చిన ‘ఒక్క అమ్మాయి తప్ప’.. ‘కృష్ణాష్టమి’లా అవుతుందా ‘భద్ర’లా మంచి ఫలితాన్నందుకుంటుందా.. వెయిట్ అండ్ సీ.
Tags:    

Similar News