ఈ సంక్రాంతికి రిలీజై మంచి స్పందన దక్కించుకుని బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న చిత్రం 'అల వైకుంఠపురములో'. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్-త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కిన హ్యాట్రిక్ చిత్రం పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా పేరుతెచ్చుకుంది. ఈ సినిమా సక్సెస్ మీట్ నిన్న విశాఖపట్నంలో జరిగింది.
ఈ కార్యక్రమంలో స్టైలిష్ స్టార్ సూపర్ స్పీచ్ ఇచ్చారు. "టెలివిజన్.. మొబైల్ ఫోన్స్.. ఇతర డిజిటల్ మీడియా వల్ల థియేటర్ల కు ప్రేక్షకులు రావడం లేదని.. సినిమాల కలెక్షన్స్ తగ్గిపోతున్నాయనే అందరూ అంటున్నారు. అలాంటి సమయంలో అల వైకుంఠపురములో రిలీజ్ అయింది. మంచి కథ.. మంచి సినిమా వస్తే థియేటర్లకు వచ్చి చూస్తామని తెలుగు ప్రేక్షకులు మరోసారి నిరూపించారు. ఇలా మంచి సినిమాలకు ఆదరణ చూపిస్తున్న తెలుగు ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్తున్నాను."
"ఈ సినిమాకు పనిచేసిన అందరికీ కృతజ్ఞతలు.. తమన్ కు స్పెషల్ థ్యాంక్స్. సినిమాకు ముందు ఎలాంటి మ్యూజిక్ కావాలని అడిగాడు. వన్ బిలియన్ వ్యూస్ వచ్చే ఆడియో కావాలని నేని తమన్ కు చెప్పాను. నేను అడిగినట్టుగానే అలాంటి సూపర్ హిట్ అల్బం అందించాడు. తమన్ కు థ్యాంక్స్."
"ఈ సినిమాకు నాతో పాటు చాలామంది నటీనటులు.. టెక్నిషియన్స్ పనిచేశారు. మా అందరికీ హిట్టు ఇచ్చారు డైరెక్టర్ త్రివిక్రమ్ గారు. ఈ సినిమాకు పని చేసిన వారు పెయింటింగ్ కు అవసరమైన వారు అయితే త్రివిక్రమ్ ఒక పెయింటర్ లాగా ఒక అద్భుతమైన పెయింటింగ్ వేశారు. గతంలో నా సినిమాలు విడుదలైనప్పుడు నాకు 'డ్యాన్సులు బాగా చేశావు.. ఫైట్లు బాగా చేశావు.. కామెడీ బాగా చేశావు' అని ప్రశంసలు వచ్చేవి. అయితే ఈ సారి మాత్రం అందరూ నా పెర్ఫార్మన్స్ బాగుందని అంటున్నారు. నా చేత ఇలా యాక్టింగ్ చేయించినందుకు త్రివిక్రమ్ గారికి కృతజ్ఞతలు."
"నాన్నగారి బ్యానర్లో చాలా పెద్ద హిట్లు ఉన్నాయి. ఇతర హీరోలతో ఇండస్ట్రీ హిట్లు ఉన్నాయి. అయితే నాన్నగారి బ్యానర్ లో నాకు ఒక్క ఇండస్ట్రీ హిట్ వస్తే బాగుండేది అని అనుకునేవాడిని. ఈ సినిమాతో ఆ కోరిక తీరేలా చేసినందుకు త్రివిక్రమ్ గారికి స్పెషల్ థ్యాంక్స్." అంటూ కొంత ఎమోషనల్ అయ్యారు అల్లు అర్జున్.