అడిగిన వెంటనే నవదీప్ మాకోసం త్యాగం చేశాడుః బన్నీ

Update: 2021-03-10 03:38 GMT
కార్తికేయ హీరోగా లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా కౌశిక్‌ దర్శకత్వంలో రూపొందిన చావు కబురు చల్లగా విడుదలకు సిద్దం అయ్యింది. బన్నీ వాసు నిర్మించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో అల్లు అర్జున్‌ మరియు అల్లు అరవింద్ లు పాల్గొన్నారు. ఈ సందర్బంగా అల్లు అర్జున్‌ మాట్లాడుతూ బన్నీ వాసుతో తనకు ఉన్న అనుబంధం గురించి చెప్పుకొచ్చాడు. గంగోత్రి సినిమా సమయం నుండి వాసుతో అనుబంధం కొనసాగుతుంది. నా సినిమాల సక్సెస్ లో నాన్న పాత్ర కంటే వాసు పాత్ర ఎక్కువగా ఉంటుంది. వాసుకు సినిమా అంత ఈజీగా నచ్చదు. కొత్త దర్శకులతో ఆయన సినిమా చేయాలనుకోడు. కాని ఈ సినిమాను కౌశిక్ దర్శకత్వంలో చేసేందుకు సిద్దం అయ్యాడు అంటే కథను ఎంతగా నచ్చాడో అర్థం చేసుకోవచ్చు.

ఈ సినిమా కథ నవదీప్ వద్ద ఉన్న సమయంలో బావా ఈ కథ కావాలని అడిగినప్పుడు తాను చేయాలనుకున్నా నా కోసం త్యాగం చేశాడు. మేము అడిగిన వెంటనే కథను ఇచ్చిన బావ నవదీప్ కు కృతజ్ఞతలు. సినిమా ను ఈ రోజు చూశాను. చాలా బాగా వచ్చింది. ఈ సినిమా దర్శకుడు కౌశిక్ వయసు 26 ఏళ్లు. ఇంత చిన్న వయసులో ఇంత ఫిలాసఫీ ఉందా అనిపించింది. ఖచ్చితంగా ఈ వయసులో నాకు ఇంత మెచ్యూరిటీ లేదు. దర్శకుడు కౌశిక్ ను చూస్తుంటే నాకే సిగ్గేస్తుంది. చిత్ర యూనిట్‌ అందరికి కూడా హిట్ ఇవ్వబోతున్నది దర్శకుడు కౌశక్ అంటూ బన్నీ వ్యాఖ్యలు చేశాడు. ఇక హీరో కార్తికేయ గురించి మాట్లాడుతూ చిన్న వయసులోనే గొప్పగా నటించాడు. నిజాయితీగా మాట్లాడి నాకు ఇష్టమైన వ్యక్తిగా మారాడంటూ కార్తికేయపై బన్నీ ప్రశంసలు కురిపించాడు.
Tags:    

Similar News