బ‌న్వ‌ర్ సింగ్ తో పుష్ప‌రాజ్ ఢీ..సోసైటీపై పంచ్!

Update: 2023-07-02 16:00 GMT
బ‌న్వ‌ర్ సింగ్ షెకావ‌త్ పై పుష్ప‌రాజ్ ఛాలెంజ్ తో? `పుష్ప` మొద‌టి భాగానికి  శుభం కార్డు ప‌డింది. కోపంతో ర‌గిలిపోయిన‌షెకావ‌త్  నిక్క‌రుతో ఇంటికెళ్తాడు. క‌సితో ఉన్న పుష్ప‌రాజ‌ల్ లుంగీ చుట్టుకుని పెళ్లి మండ‌పా నికి వెళ్తాడు. ఇప్పుడంతా అయిపోయిందిగా! అని పుష్ప రాజ్ కి కాబోయే భార్య అంటే?  కాదు..ఇప్పుడే మొద లైందని పుష్ప‌రాజ్ రౌద్రంతో అంటాడు. దీంతో `పుష్ప‌-2` క‌థ ప్ర‌ధానంగా ఆ రెండు పాత్ర‌ల మ‌ధ్య తిరుగు తుంద‌ని తేలిపోయింది. రెండ‌వ భాగం మొత్తం ఇద్ద‌రి ఈగో ప్యాక్ట‌ర్  మ‌ధ్య క‌థ న‌డుస్తుంది.

దీంతో ఈ రెండు పాత్ర‌ల్ని సినిమాలో చాలా బ‌లంగా ఉంటాయ‌ని అంచ‌నా వేయోచ్చు.  తాజాగా యూనిట్ వ‌ర్గాల నుంచి అందుతోన్న స‌మాచారం ప్ర‌కారం ఇద్ద‌రి మ‌ధ్య సాలిడ్ స‌న్నివేశాలు సుకుమార్ డిజైన్ చేసిన‌ట్లు తెలుస్తోంది. ఇద్ద‌రి ఈగోని బేస్ చేసుకుని వ‌చ్చే స‌న్నివేశాలు నెక్స్ట్ లెవ‌ల్లోనే ఉంటాయం టున్నారు. ఇప్ప‌టివ‌ర‌కూ ఇండియ‌న్  తెర‌పై  అంత‌టి బ‌ల‌మైన స‌న్నివేశాలు చూసి ఉండ‌ర‌ని..ఎవ‌రి ఊహ‌కంద‌ని విధంగా ఆయా స‌న్నివేశాలు డిజైన్ చేసిన‌ట్లు వినిపిస్తుంది.

ఇవి ప‌క్కా సుకుమార్ మార్క్ స‌న్నివేశాలంటున్నారు. ఇంట‌ర్నేష‌న‌ల్ స్మ‌గ్ల‌ర్ గా ఎదిగిన పుష్ప రాజ్ ని ఢీ కొట్ట‌డం కోసం బ‌న్వ‌ర్ సింగ్ కి  ప్ర‌భుత్వం నుంచి అన్ని ర‌కాల స‌హ‌కారాలు అంద‌డం.. వాటిని వ్య‌క్తిగ‌త క‌క్ష‌ని తీర్చుకోవ‌డం కోసం ఎలా దుర్వినియోగం చేస్తాడు? వంటి స‌న్నివేశాలు రా అండ్ ర‌స్టిక్ గా చిత్రీక‌రిస్తు న్న‌ట్లు తెలుస్తోంది. ఇక్క‌డ డ‌బ్బు అనే అంశాన్ని కూడా ప్ర‌ధానంగా హైలైట్ చేయ‌బోతున్నారుట‌.

అన్ని ఉన్నా ఒక ఫేజ్ లో! ఈగో కార‌ణంగా  ఒంట‌రి వాడిగా మిగిలిపోయిన పుష్ప రాజ్ ని సినిమాలో చూపించబోతున్నారుట‌. ఈ స‌న్నివేశం తొలి  భాగంపై వ‌చ్చిన కొన్ని ర‌కాల విమర్శ‌ల‌కు చెక్ పెట్టేలా ఉంటుందిట‌. స్మ‌గ్లింగ్ చేసేవాడిని హీరోలా ఎలా చూపిస్తార‌ని  ఓ అవ‌ధాని విమర్శించిన సంగ‌తి తెలిసిందే. అప్ప‌ట్లో సోష‌ల్ మీడియాలో ఈ విమ‌ర్శ బ‌ల‌మైన చ‌ర్చ‌కు దారి తీసింది. వాటికి రెండ‌వ భాగంలో స‌మాధానాలు దొరుకుతాయ‌ని అంటున్నారు.  మొత్తానికి పుష్ప‌-2 తో సుకుమార్ సోసైటీకి చాలా విష‌యాలే చెప్ప‌బోతున్న‌ట్లు తెలుస్తోంది.

Similar News