అల్లు అర్జున్ 20వ చిత్రం సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న విషయం తెల్సిందే. నేడు అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్బంగా సినిమా టైటిల్ ను రివీల్ చేయడంతో పాటు అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. నేడు ఉదయం 9 గంటలకు పుష్ప టైటిల్ అంటూ ప్రకటిస్తూ అల్లు అర్జున్ మాస్ లుక్ ను విడుదల చేసిన విషయం తెల్సిందే. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆ లుక్ కు ఫిదా అయ్యారు. ఫ్యాన్స్ సంతోషం మరింత పెంచేందుకు అన్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు మరో ఫొటోను కూడా విడుదల చేశారు.
రెండవ పోస్టర్ లో సినిమా కథపై ఉన్న అనుమానాలు అన్నింటిని కూడా పటాపంచలు చేసేశారు. మొదటి నుండి గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుందని ప్రచారం జరుగుతూ వస్తోంది. అన్నట్లుగానే ఈ పోస్టర్ లో గందపు చెక్కలు ఇంకా పోలీసులు ఉన్నారు. ఈ స్టిల్ చూస్తుంటే గందపు చెక్కలు స్మగ్లింగ్ చేస్తున్న లారీని పట్టుకుని పోలీసులు మీడియా ముందు ప్రవేశ పెట్టినట్లుగా ఉంది. ఇందులో గందపు చెక్కల స్మగ్లర్ బన్నీ అని క్లీయర్ గా అర్థం అవుతుంది. కథలో ఏమైనా ట్విస్ట్ ఉంటుందా లేదంటే మొదటి నుండి చివరి వరకు కూడా బన్నీ గందపు చెక్కల స్మగ్లర్ గానే కనిపిస్తాడా అనేది చూడాలి.
ఇక ఈ చిత్రం మలయాళంలో సూపర్ హిట్ అయిన పులిమురగన్ చిత్రానికి పోలి ఉన్నట్లుగా అనిపిస్తుంది. మోహన్ లాల్ నటించిన పులి మురగన్ చిత్రం తెలుగులో మన్యంపులి టైటిల్ తో డబ్ అయిన విషయం తెల్సిందే. ఆ సినిమాలో మోహన్ లాల్ లారీ డ్రైవర్ గా పరి చేస్తూ పులిని వేటాడుతూ ఉంటాడు. ఇప్పుడు ఈ సినిమాలో కూడా అల్లు అర్జున్ లారీ డ్రైవర్ గందపు చెక్కలను స్మగ్లింగ్ చేస్తూ ఉంటాడు. ఆ సినిమా ఎక్కువగా అడవిలోనే సాగుతుంది. ఇక పుష్ప చిత్రం కూడా మెజార్టీ పార్ట్ అడవిలో ఉంటుందని సమాచారం అందుతోంది.
ఈ సినిమా గురించి మరో ఆసక్తికర విషయం ఏంటీ అంటే ఈ సినిమాను మొదట మహేష్ బాబుతో తెరకెక్కించాలని సుకుమార్ అనుకున్నాడు. రంగస్థలం సమయంలోనే ఈ కథను సిద్దం చేసుకున్నాడు. మహేష్ బాబుకు వినిపించాడు. స్క్రిప్ట్ వర్క్ అంతా అయిన తర్వాత ఈ కథ నా కంటే రామ్ చరణ్ లేదా బన్నీకి అయితేనే బాగుంటుందని మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమా చేసేశాడు. మహేష్ ఈ సినిమాకు ఒప్పుకుని ఉంటే మొన్న సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు స్థానంలో ఇదే వచ్చేది. మహేష్ నో చెప్పడంతో చరణ్ వద్దకు ఈ కథ వెళ్లింది. ఆర్‌ఆర్‌ఆర్ చిత్రం కారణంగా డేట్లు వెంటనే ఇవ్వలేనంటూ చరణ్ చెప్పాడు. కాని చరణ్ కు ఈ కథ చేయాలని చాలా ఆసక్తిగా ఉందట. కాని అప్పటి వరకు వెయిట్ చేయడం తనవల్ల కాదని సుకుమార్ బన్నీతో మొదలు పెట్టాడు. వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఈ కరోనా లాక్ డౌన్ లేకుంటే సినిమా షూటింగ్ ప్రస్తుతం కేరళలో జరిగేది. లాక్ డౌన్ ఎత్తి వేసిన వెంటనే కేరళలో షూటింగ్ కు యూనిట్ సభ్యులు వెళ్లబోతున్నారు. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా రష్మిక నటించబోతుంది. ఇందులో రష్మిక పాత్ర గిరిజన అమ్మాయి అంటూ వార్తలు వస్తున్నాయి. ఆ విషయమై క్లారిటీ రావాల్సి ఉంది. బన్నీ రెండు పోస్టర్ లు చూసిన తర్వాత సినిమాపై క్లారిటీ వచ్చినా సినిమాపై అంచనాలు మాత్రం మరింతగా పెరిగాయి.