'అల్లు అర్జున్ రెడ్డి'.. బన్నీ భార్య ఇన్‌స్టా స్టోరీ వైరల్..!

Update: 2022-11-16 14:48 GMT
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సతీమణి స్నేహా రెడ్డికి సోషల్ మీడియాలో ఉండే ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్టార్ హీరోయిన్స్ తో సమానంగా ఆమెకు నెట్టింట క్రేజ్ ఉంది. ఎలాంటి పోస్ట్ పెట్టినా కొన్ని నిమిషాల్లోనే వైరల్ అవుతూ ఉంటుంది.

అల్లు స్నేహా రెడ్డి తాజాగా ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఓ ఫోటో ఇప్పుడు ఇంటర్నెట్‌ లో సందడి చేస్తోంది. దీనికి కారణం అందులో ఆమె భర్త బన్నీ పేరుని "అల్లు అర్జున్ రెడ్డి" అని రాయబడి ఉండటమే. అల్లు అర్జున్ పక్కన "రెడ్డి" ట్యాగ్ చేరడం నెటిజన్లు దీని గురించి మాట్లాడుకునేలా చేసింది.
 
ఇటీవల అల్లు అర్జున్ తన భార్యామణి స్నేహతో కలిసి ఒక వివాహ వేడుకలో పాల్గొనడానికి దక్షిణాఫ్రికాకు వెళ్లారు. అక్కడ స్టార్ వైఫ్ కు అనేక బహుమతులు.. వివిధ కార్యక్రమాలకు ఆహ్వానాలు అందాయి. హైదరాబాద్ కి తిరిగొచ్చిన తర్వాత వాటి గురించి ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలలో షేర్ చేసింది.

అందులో అల్లు స్నేహా రెడ్డికి వచ్చిన ఓ గిఫ్ట్ అందరి దృష్టిని ఆకర్షించింది. కార్డ్‌ పై “స్నేహ & అల్లు అర్జున్ రెడ్డి” అని రాసి ఉండటం బన్నీ అభిమానులను ఆశ్చర్యపరిచింది. ఎప్పుడూ లేనిది ఇదేంటి కొత్తగా "రెడ్డి" వచ్చి చేరిందని ఆలోచించారు.

అయితే బన్నీని పెళ్ళి చేసుకొని అల్లు వారి కోడలిగా అడుగుపెట్టినప్పటికీ స్నేహ తనను తాను అల్లు స్నేహా రెడ్డి గానే పిలిపించుకుంటోంది. అందుకే “రెడ్డి” అనేది అల్లు అర్జున్ నుండి వచ్చి ఉంటుందని ఇప్పుడు ఆ బహుమతి పంపినవారు భావించి ఉండవచ్చు.

నార్త్ ఇండియన్స్ మన తెలుగు వారి పేర్లు మరియు సంప్రదాయాలను అర్థం చేసుకోవడం కష్టం కాబట్టి.. ఈ పొరపాటు జరిగి ఉండవచ్చు. అందుకే "అల్లు అర్జున్ రెడ్డి" గా సంబోధించి ఉంటుందని భావించవచ్చు.

ఇకపోతే అల్లు అర్జున్ మరియు స్నేహ రెడ్డి వేర్వేరు సామాజిక వర్గాలకి చెందినవారనే సంగతి తెలిసిందే. ఇద్దరూ ప్రేమించుకొని 2011లో పెళ్ళి చేసుకున్నారు. వీరి అన్యోన్యమైన దాంపత్య జీవితానికి గుర్తుగా అల్లు అయాన్ మరియు అర్హ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. స్నేహా ఎప్పటికప్పుడు తన భర్త - పిల్లలకు సంబంధించిన ఫోటోలు - వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది.

ఇక అల్లు అర్జున్ సినిమాల విషయానికి వస్తే.. పుష్ప తో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. ఇప్పుడు "పుష్ప 2" మూవీ రెగ్యులర్ షూటింగ్ కోసం సన్నద్ధం అవుతున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ యాక్షన్ డ్రామా.. వచ్చే యేడాది చివర్లో లేదా 2024 ప్రారంభంలో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News