రామ్ చరణ్ - శ్రీనువైట్ల కాంబినేషన్ లో వస్తున్న మూవీకి.. ఎట్టకేలకు పేరు పెట్టారు. చిరు బర్త్ డేకి టీజర్ రిలీజ్ చేసినా... టైటిల్ లేకుండానే ఎయిర్ చేసిన వైట్ల... ముందుగా అనుకున్న టైటిల్ కే ఓటేసి... బ్రూస్‌లీ అని పేరు పెట్టారు. రెస్పాన్స్ కంటే.. కేరక్టర్, స్టోరీ డిమాండ్ కి తగినట్లుగా టైటిల్ ఫిక్స్ అయింది. అయితే.. బ్రూస్ లీ వెనకాల ది ఫైటర్ అనే ట్యాగ్ లైన్ కూడా జత చేశారు.
నిజానికి ఫైటర్ అనే టైటిల్ ఎప్పుడో రిజిస్టర్ చేశాడు అల్లువారబ్బాయి అర్జున్. మనోడికి ఈపేరు బాగా ఇష్టం కూడా. స్టోరీ సెట్ అయితే... ఎప్పటికైనా ఆ పేరుతోటి సినిమా చేయాలని అనుకున్నాడు. అలాంటి టైంలో బ్రూస్ లీ.. ది పైటర్ అంటూ చరణ్ ఫిక్స్ అయిపోయాడు. దీంతో తన టైటిల్ ని వదులుకోక తప్పడం లేదు బన్నీకి. ఇంకెవరైనా అయితే.. టైటిల్ పై కాస్త ఆలోచించేవాడేమో. ఇక్కడున్నది చెర్రీ. అలాంటప్పుడు ఏ పైటర్ కూడా ఏం చేయలేడు కదా... ఇద్దరూ కలిసి కనపడకపోయినా.. ఒక చోటకి చేరితే ఎలా ఉంటుందో చూపించారు ఎవడుతో. అయినా బావాబామ్మర్దుల మధ్య ఫైటర్ వస్తాడేంటండీ... ఇద్దరూ కలిపి ఇరగదీసేయారూ!!