సూర్యకి పాతిక కోట్లు వెనకేశాడా?

Update: 2017-06-22 07:12 GMT
అల్లు అర్జున్ ప్రస్తుతం దువ్వాడ జగన్నాధం ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. రేపు ఈ మూవీ థియేటర్లలోకి రానుడంగా.. మరో వారం రోజుల పాటు డీజేకు ప్రచారంలో పాల్గొనే అవకాశాలున్నాయి. ఆ తర్వాత వెంటనే వక్కంతం వంశీ దర్శకుడిగా పరిచయం అవుతూ తెరకెక్కనున్న 'నా పేరు సూర్య' షూటింగ్ ప్రారంభించేస్తాడు అల్లు అర్జున్.

నా పేరు సూర్య కోసం అల్లు అర్జున్ రెమ్యూనరేషన్ లెక్క ఇప్పుడు ఇండస్ట్రీ జనాలకు ఆశ్చర్యానికి గురి చేస్తోంది. సహజంగా పారితోషికం విషయంలో బన్నీ పట్టుపట్టడని.. సినిమా బిజినెస్ పూర్తయ్యాకే తీసుకుంటాడని.. అవసరమైతే లాభాల్లో షేరింగ్ తో సరిపెట్టుకుంటాడని అంటారు. కానీ నా పేరు సూర్య విషయంలో మాత్రం బన్నీ ఏకంగా 25 కోట్ల రెమ్యూనరేషన్ పుచ్చుకుంటున్నాడట. లగడపాటి శ్రీధర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మెగా బ్రదర్ నాగేంద్రబాబు.. బన్నీ వాస్ కూడా నిర్మాణ భాగస్వాములుగా ఉన్నారు. లాభాల వాటాలో వీరిద్దరికి కలిపి సగం అందనుందట.

నా పేరు సూర్య చిత్ర నిర్మాణానికి బన్నీ రెమ్యూనరేషన్ కాకుండా 25 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించారట. ముందుగా ప్లాన్ చేసిన ప్రకారం.. ఫుల్ స్పీడ్ లో పిక్చరైజేషన్ పూర్తి చేస్తారని తెలుస్తోంది. ఖర్చు పరంగా మొత్తం 50 కోట్లతో రూపొందనున్న ఈ మూవీకి.. ప్రీ రిలీజ్  బిజినెస్ రూపంలోనే 100 కోట్లను దాటడం ఖాయం. అంటే.. సినిమా ప్రారంభించేనాటికే.. మేకర్స్ ఫుల్ ప్రాఫిట్స్ లో ఉంటారన్న మాట.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News