మోడీ డెసిషన్ కి బన్నీ ఎక్సైట్మెంట్

Update: 2016-11-08 15:36 GMT
దేశంలో నల్లధనం నిరోధించడానికి ప్రధాని నరేంద్రమోడీ అనూహ్యమైన చర్యను ప్రకటించారు. ఇవాళ అర్ధరాత్రి నుంచి దేశవ్యాప్తంగా 500.. 1000 రూపాయల నోట్లను చెలామణీలోంచి రద్దు చేస్తున్నట్లు స్వయంగా ప్రకటించేశారు. అయితే దేశవ్యాప్తంగా బ్యాంకులు. - పోస్టాఫీసుల్లో డిపాజిట్ చేసుకోవచ్చని చెప్పిన మోడీ.. అత్యవసర సేవలు.. వైద్య సేవలు.. రైల్వే సేవల కోసం ఈ నోట్లు చెల్లుతాయని ప్రకటించారు.

మోడీ తీసుకున్న ఈ స్టెప్.. ఆర్థిక వ్యవస్థను కీలకంగా మార్చేదే. ఇది సెలబ్రిటీల్లో కూడా కదలికను తీసుకొచ్చేసింది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మొదటగా కేంద్రం తీసుకన్న నిర్ణయంపై స్పందించాడు. ఇండియా ఫ్లాగ్ తో పాటు.. ఓ 40-50 క్లాప్ సింబల్స్ ను ట్వీట్ చేసి తన ఎక్సైట్ మెంట్ ను ప్రకటించాడు. నోట్లను బ్యాంకుల్లో మార్చుకునే అవకాశం ఉన్నా.. 20వేల రూపాయల లిమిట్ ఉండడం లాంటివి బాగా ప్రభావం చూపే అంశాలు.

మరోవైపు 500.. 2000 రూపాయల డినామినేషన్ తో కొత్త నోట్లు ఇంట్రడ్యూస్ చేస్తామని త్వరలో ఇవి అందుబాటులోకి వస్తాయని కేంద్రం ప్రకటించింది. అంతే కాదు.. రేపు బ్యాంకులు పని చేయవని.. అలాగే.. రెండు రోజుల పాటు ఏటీఎం సేవలను కూడా పూర్తిగా నిలిపివేయాలని కేంద్రం ఆదేశించింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News