అల్లు అర్జున్ ప్రస్తుతం ''పుష్ప: ది రైజ్'' మూవీ ప్రమోషనల్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ డ్రామాలో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది. శుక్రవారం (డిసెంబర్ 17) ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో ఈ సినిమా విడుదల కానుంది.
ఈ నేపథ్యంలో 'పుష్ప: ది రైజ్' ప్రచార కార్యక్రమాల్లో భాగంగా అల్లు అర్జున్ - రష్మిక ఈరోజు బుధవారం బెంగళూరులో నిర్వహించిన స్పెషల్ ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. చిత్ర విశేషాలతో పాటుగా మీడియా ప్రతినిధులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.
ఈ సందర్భంగా దివంగత కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణంపై అల్లు అర్జున్ స్పందించారు. ''నా స్నేహితుడు పునీత్ రాజ్ కుమార్ మరణవార్త నన్ను ఎంతో కలచి వేసింది. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. 'పుష్ప' సినిమాతో బిజీగా ఉండటం వల్ల నేను బెంగళూరు రాలేకపోయా. ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పటికీ పునీత్ కుటుంబాన్ని కలవాలనుకోవడం లేదు. ఎందుకంటే మూవీ ప్రమోషన్స్ కి వచ్చి కలిశాననిపించుకోవడం నాకు నచ్చదు'' అని బన్నీ తెలిపారు.
'పుష్ప' ప్రమోషన్స్ కోసం బెంగళూరు రావడం ఆనందంగా ఉంది. నేను ఇక్కడ పుట్టకపోయినా చిన్నప్పుడు సెలవుల్లో ఎంజాయ్ చేయడానికి ఎక్కువగా ఈ ప్రాంతానికే వచ్చేవాళ్ళం. బెంగళూరులో నా సినిమాలు రిలీజ్ అవుతాయని కలలో కూడా ఊహించలేదు అని అల్లు అర్జున్ అన్నారు.
కర్ణాటకలో 'పుష్ప' సినిమా వసూళ్ల గురించి మాట్లాడుతూ.. ''స్టోరీ నచ్చితే ప్రేక్షకులు తప్పకుండా సినిమాని ఆదరిస్తారని నమ్ముతాను. ఎంత కలెక్ట్ చేస్తుందనేది నేను చెప్పలేను. మా సినిమా ప్రేక్షకులందరికీ నచ్చుతుందా లేదా అనేది మాత్రమే నేను చూసుకుంటా'' అని బన్నీ తెలిపారు. రష్మిక తనకు బాగా నచ్చిన అమ్మాయని.. మంచి నటి అని.. తెలుగు హిందీ, ఇలా అన్ని ఇండస్ట్రీల్లోనూ సత్తా చూపిస్తోందని చెప్పుకొచ్చారు.
ఇకపోతే 'పుష్ప' ప్రెస్ మీట్ కు సుమారు రెండు గంటలు ఆలస్యంగా రావడంపై మీడియా అసంతృప్తి వ్యక్తం చేయడంతో.. అల్లు అర్జున్ వారికి క్షమాపణలు చెప్పారు. పొగమంచు కారణంగా తాము వచ్చిన ప్రైవేట్ ఫ్లైట్ టేకాఫ్ లో ఇబ్బందులు తలెత్తాయని.. అందుకే ఈ కార్యక్రమానికి ఆలస్యమైందని అన్నారు. ఇందుకుగాను మీడియా మిత్రులకు క్షమాపణలు చెప్పిన బన్నీ.. సారీ చెబితే మనిషి పెరుగుతాడని.. ఎక్కడా తగ్గడని అభిప్రాయపడ్డారు.