తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతికి చాలా ప్రాముఖ్య ఉంటుంది. ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో సంక్రాంతి సంబురాలు అంబరాన్ని తాకుతాయి. గోదావరి జిల్లాలకు చెందిన వారు దేశంలోనే కాదు ప్రపంచంలో ఏ మూలన ఉన్నా కూడా సంక్రాంతికి సొంత ప్రాంతంకు రావాలని ఉవ్విల్లూరుతూ ఉంటారు. గోదావరి జిల్లాల్లో జరిగే సంక్రాంతి వేడుకలు చాలా ప్రత్యేకం అని చెప్పాలి. అందుకే ఈసారి సంక్రాంతికి అల్లు అర్జున్ తన సొంత ఊరు అయిన పాలకొల్లుకు వెళ్లబోతున్నాడట.
పండుగకు ఎక్కువ శాతం హైదరాబాద్ శివారులో ఉండే మామ ఊరు వేళ్లే బన్నీ ఈసారి మాత్రం తన తండ్రి, తాతకు చెందిన ఊరు పాలకొల్లుకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసం ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయట. బ్రహ్మోత్సవం సినిమాలో మహేష్ బాబు తన బంధువులను తెలుసుకుంటూ వెళ్లినట్లుగా - పాత బంధుత్వాలను మళ్లీ కలుపుకుంటూ ముందుకు సాగినట్లుగా అల్లు అర్జున్ కూడా ఎన్నో ఏళ్ల క్రితం దూరం అయిన పాలకొల్లు బంధువులను కలుసుకోబోతున్నాడు. అల్లు అర్జున్ తాత - తండ్రిది పాలకొల్లు. కాని బన్నీ ఎప్పుడు కూడా అక్కడ ఉండటం కాని - పెరగడం కాని జరగలేదు.
చెన్నై - హైదరాబాద్ లే బన్నీకి సొంత ప్రాంతాలు - ప్రదేశాలుగా చెప్పుకోవచ్చు. కాని ఇన్నాళ్లకు సంక్రాంతికి అల్లు అర్జున్ పాలకొల్లు వెళ్లబోతున్న నేపథ్యంలో అంతా కూడా ఈ విషయమై చర్చించుకుంటున్నారు. ఉన్నట్లుండి - ఇన్నాళ్ల తర్వాత బన్నీకి సొంత ప్రాంతం - సొంత ఊరు గుర్తు రావడం ఏంటో అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైతేనేం మొత్తానికి అల్లు అర్జున్ పాలకొల్లు రాబోతున్నాడంటూ స్థానికులు మరియు మెగా బంధువులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ సాంప్రదాయం ముందు ముందు కూడా బన్నీ కొనసాగిస్తాడా లేదంటే ఈ ఒక్కసారితోనే ఫుల్ స్టాప్ పెడతాడో చూడాలి.